నెహెమ్యా 3
3
గోడ కట్టినవారు
1ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సోదరులైన యాజకులును వెళ్లి గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి దాని తలుపులు నిలబెట్టారు. వందవ గోపురం వరకు, హనానేలు గోపురం వరకు వారు నిర్మించి ప్రతిష్ఠించారు. 2ఆ ప్రక్కనే యెరికో పట్టణస్థులు కట్టారు. వారి ప్రక్కన ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాడు.
3చేప గుమ్మాన్ని హస్సెనాయా కుమారులు తిరిగి కట్టారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు అమర్చారు. 4వారి ప్రక్క భాగంలో హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు మరమ్మత్తు చేశాడు. అతని తర్వాత మెషేజబేలుకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లాము, ఆ ప్రక్కన బయనా కుమారుడైన సాదోకు వరుసగా బాగుచేశారు. 5ఆ ప్రక్క భాగాన్ని తెకోవాకు చెందినవారు బాగుచేశారు. అయితే తమ అధిపతుల క్రింద పనిని చేయడానికి వారి అధికారులు ఒప్పుకోలేదు.
6యెషానా#3:6 అంటే పాతది గుమ్మాన్ని పాసెయ కుమారుడైన యెహోయాదా బెసోద్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు. 7ఆ ప్రక్క నుండి గిబియోను, మిస్పా పట్టణస్థులైన గిబియోనీయుడైన మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. యూఫ్రటీసు నది అవతలి అధిపతుల ఆధీనంలో ఉన్న స్థలాల వరకు వారు బాగుచేశారు. 8ఆ ప్రక్క భాగాన్ని కంసాలివాడైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేశాడు. అతని ప్రక్కనే పరిమళద్రవ్యాలు తయారుచేసేవారిలో ఒకడైన హనన్యా బాగుచేశాడు. వారు విశాల గోడ వరకు యెరూషలేమును తిరిగి కట్టారు. 9వీరి ప్రక్క భాగాన్ని యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేశాడు. 10వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేశాడు. అతని ప్రక్కనే హషబ్నెయా కుమారుడైన హట్టూషు బాగుచేశాడు. 11రెండవ భాగాన్ని, బట్టీల గోపురాన్ని హారీము కుమారుడైన మల్కీయా, పహత్-మోయాబు కుమారుడైన హష్షూబు బాగుచేశారు. 12వారి ప్రక్క భాగంలో యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హల్లోహేషు కుమారుడైన షల్లూము అతని కుమార్తెల సహాయంతో బాగుచేశారు.
13లోయ గుమ్మాన్ని హానూను, జానోహలో నివసిస్తున్నవారు బాగుచేశారు. వారు దానిని బాగుచేసి తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు. అంతే కాకుండా పెంట గుమ్మం వరకు వెయ్యి మూరల#3:13 అంటే, సుమారు 450 మీటర్లు గోడ కట్టారు.
14పెంట గుమ్మాన్ని బేత్-హక్కెరెము ప్రదేశానికి అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా బాగుచేశాడు. అతడు దానికి మరమ్మత్తులు చేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు బిగించాడు.
15నీటి ఊట గుమ్మాన్ని మిస్పా ప్రదేశానికి అధిపతియైన కొల్-హోజె కుమారుడైన షల్లూము బాగుచేశాడు. అతడు దానిని బాగుచేసి పైకప్పు వేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు అమర్చాడు. అంతే కాకుండా దావీదు పట్టణం నుండి క్రిందకు వెళ్లే మెట్ల వరకు రాజుగారి తోట దగ్గర సిలోయము కొలను గోడను అతడే నిర్మించాడు. 16అతని ప్రక్క భాగం నుండి దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకు కట్టి ఉన్న కోనేరు వరకు, యుద్ధవీరుల ఇళ్ళ వరకు బేత్-సూరులో సగభాగానికి అధిపతియైన అజ్బూకు కుమారుడైన నెహెమ్యా బాగుచేశాడు.
17అతని ప్రక్కనే లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేశాడు. అతని తర్వాతి భాగాన్ని కెయీలాలో సగభాగానికి అధిపతియైన హషబ్యా బాగుచేశాడు. 18అతని ప్రక్క భాగాన్ని వారి బంధువులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేశాడు. అతడు కెయీలాలో సగభాగానికి అధిపతిగా ఉన్నాడు. 19అతని తర్వాతి భాగాన్ని ఆయుధశాల మార్గానికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన మరొక భాగాన్ని మిస్పాకు అధిపతి యెషూవ కుమారుడైన ఏజెరు బాగుచేశాడు. 20అతని ప్రక్కనే ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి గుమ్మం వరకు జక్కయి కుమారుడైన జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తిగా పని చేశాడు 21ఆ ప్రక్కనే మరొక భాగాన్ని ఎల్యాషీబు ఇంటి గుమ్మం నుండి ఆ ఇంటి చివరి వరకు హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేశాడు.
22అతని ప్రక్కనే చుట్టుప్రక్కల ఉన్న యాజకులు బాగుచేశారు. 23వారి ప్రక్కనే బెన్యామీను హష్షూబు అనేవారు తమ ఇంటి ఎదుట ఉన్న భాగాన్ని మరమ్మత్తు చేశారు. వారి ప్రక్కనే అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా తన ఇంటి ప్రక్కన ఉన్న భాగాన్ని బాగుచేశాడు. 24అతని ప్రక్కనే అజర్యా ఇంటి నుండి గోడ మలుపు మూల వరకు ఉన్న భాగాన్ని హేనాదాదు కుమారుడైన బిన్నూయి బాగుచేశాడు. 25ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు. 26ఓఫెలులో నివసిస్తున్న ఆలయ సేవకులు తూర్పున ఉన్న నీటిగుమ్మం ప్రక్కన, గోపురం దగ్గర బాగుచేశారు. 27వారి తర్వాతి భాగాన్ని, గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న భాగం నుండి ఓఫెలు గోడ వరకు తెకోవాకు చెందినవారు బాగుచేశారు.
28గుర్రపు గుమ్మానికి పైన తమ ఇళ్ళకు ఎదురుగా ఉన్న భాగాలను యాజకులందరు బాగుచేశారు. 29వారి తర్వాత తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేశాడు. ఆ ప్రక్క భాగాన్ని తూర్పు గుమ్మాన్ని కాపలా కాసే షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేశాడు. 30ఆ తర్వాత షెలెమ్యా కుమారుడైన హనన్యా, జాలాపు ఆరవ కుమారుడైన హానూను మరొక భాగాన్ని బాగుచేశారు. వారి తర్వాత తన గదికి ఎదురుగా ఉన్న భాగాన్ని బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశాడు. 31అతని ప్రక్కనే ఆలయ సేవకుల ఇంటి నుండి, పరిశీలన గుమ్మానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకు కంసాలివాడైన మల్కీయా బాగుచేశాడు. 32మూలన ఉన్న పై గది నుండి గొర్రెల గుమ్మం మధ్య వరకు కంసాలివారు, వ్యాపారులు బాగుచేశారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నెహెమ్యా 3: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: