కీర్తనలు 114
114
కీర్తన 114
1ఇశ్రాయేలు ఈజిప్టు నుండి,
యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక,
2యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది,
ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది.
3అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది,
యొర్దాను వెనుకకు తిరిగింది;
4పర్వతాలు పొట్టేళ్లలా,
కొండలు గొర్రెపిల్లల్లా గంతులేశాయి.
5సముద్రమా, నీవెందుకు పారిపోయావు?
యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు?
6పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా,
కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు?
7ఓ భూమి, ప్రభువు సన్నిధిలో
యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.
8ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు,
చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 114: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.