కీర్తనలు 39
39
కీర్తన 39
సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన.
1నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి
నా మార్గాలను సరిచూసుకుంటాను;
దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడు
నా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను.
2అందువల్ల నేను ఏమీ మాట్లాడకుండా
పూర్తిగా మౌనంగా ఉండిపోయాను.
కానీ నా వేదన అధికమయ్యింది;
3నా గుండె నాలో వేడెక్కింది.
నేను ధ్యానిస్తూ ఉండగా మంట రగులుకుంది;
అప్పుడు నోరు తెరచిమాట్లాడాను:
4“యెహోవా, నా జీవిత ముగింపు
నా రోజుల సంఖ్యను నాకు చూపించండి;
నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి.
5మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు;
నా జీవితకాలం మీ ఎదుట శూన్యము.
భద్రత గలవారిగా అనిపించినా,
మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా
6“నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు;
వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే
వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.
7“కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను?
మీలోనే నా నిరీక్షణ.
8నా అతిక్రమాలన్నిటి నుండి నన్ను విడిపించండి;
మూర్ఖులు ఎగతాళి చేయడానికి నన్ను లక్ష్యంగా చేయకండి.
9ఇదంతా చేసింది మీరే కాబట్టి
నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను.
10దయచేసి నన్ను కొట్టడం ఆపేయండి;
మీ చేతి దెబ్బలకు నేను అలసిపోతున్నాను.
11మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు,
చిమ్మెటలా మీరు వారి సంపదను హరించివేస్తారు.
మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా
12“యెహోవా, నా ప్రార్థన వినండి,
నా మొర ఆలకించండి.
నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి.
నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.
13నేను గతించిపోకముందు మళ్ళీ ఆనందించేలా
మీ చూపును నా నుండి త్రిప్పివేయండి.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 39: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: