కీర్తనలు 44
44
కీర్తన 44
సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన.
1ఓ దేవా! మా పూర్వికుల రోజుల్లో
పురాతన కాలంలో
మీరు చేసినదంతా
మా పితరులు మాకు చెప్పారు.
2మీ స్వహస్తంతో దేశాలను వెళ్లగొట్టారు
మా పూర్వికులను అక్కడ నిలబెట్టారు;
ఆయా జాతుల ప్రజలను నాశనం చేసి
మా పూర్వికులను వర్ధిల్లేలా చేశారు.
3తమ ఖడ్గంతో ఈ దేశాన్ని వారు వశం చేసుకోలేదు,
తమ భుజబలంతో విజయం సాధించలేదు;
మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీ కుడిచేయి మీ భుజబలం
మీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది.
4మీరే మా రాజు, మీరే మా దేవుడు,
యాకోబు ప్రజలకు విజయం కలగాలని ఆజ్ఞాపిస్తారు.
5మీ వలన విరోధులను పడగొట్టగలం;
మా మీదికి ఎగబడే వారిని మీ పేరట అణచివేయగలము.
6మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు,
మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు.
7మా విరోధులపై మాకు విజయమిచ్చేది మీరే,
మీరే పగవారికి సిగ్గుపడేలా చేశారు.
8దేవుని యందు మేము దినమంతా అతిశయిస్తాం
మీ నామాన్ని నిత్యం స్తుతిస్తాము. సెలా
9కాని ఇప్పుడైతే మీరు మమ్మల్ని త్రోసివేసి అవమానపరిచారు;
మా సైన్యంతో మీరు రావడం లేదు.
10శత్రువుల ముందు పారిపోవలసి వచ్చింది,
పగవారు మమ్మల్ని దోచుకున్నారు.
11గొర్రెలను ఆహారంగా ఇచ్చినట్లు మమ్మల్ని వారికిచ్చారు
దేశాల మధ్యకు మమ్మల్ని చెదరగొట్టారు.
12లాభం చూసుకోకుండా నీ ప్రజలను,
తక్కువ వెలకు అమ్మేశారు.
13పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు;
మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు.
14మమ్మల్ని జనాల నోట సామెతలా చేశారు;
జనాంగాలు తలలూపుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.
15-16నిందిస్తూ హేళన చేసేవారి కారణంగా
పగ తీర్చుకోవాలనుకునే శత్రువుల కారణంగా
శత్రువులు మా ఎదుటకు వస్తే,
దినమంతా మాకు అవమానమే;
సిగ్గు మా ముఖాన్ని కమ్మివేసింది.
17ఇదంతా మా మీదికి వచ్చిపడినా,
మేము మిమ్మల్ని మరవలేదు;
మీ నిబంధన విషయం నమ్మకద్రోహులం కాలేదు.
18మా హృదయం వెనుదీయలేదు;
మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు.
19నక్కలు తిరిగే చోట మీరు మమ్మల్ని నలగ్గొట్టి పడేశారు;
చావు నీడ మమ్మల్ని ఆవరించి ఉన్నది.
20ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా,
పరదేశి దేవుని వైపు చేతులు చాపినా,
21హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు
ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా?
22అయినా రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం;
వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.
23ప్రభువా, లెండి! ఎందుకీ నిద్ర?
లెండి మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టకండి.
24మీ ముఖాన్ని మా నుండి ఎందుకు దాచుకుంటున్నారు?
నా బాధను నా హింసను మరచిపోయారా?
25మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము;
మా దేహాలు నేలకు అంటుకుపోయాయి.
26లేచి మాకు సాయం చేయండి;
మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 44: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: