కీర్తనలు 96
96
కీర్తన 96
1యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి;
సమస్త భూలోకమా, యెహోవాకు పాడండి.
2యెహోవాకు పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి;
అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.
3దేశాల్లో ఆయన మహిమను,
సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
4యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు;
దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.
5ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు,
కాని యెహోవా ఆకాశాలను సృజించారు.
6వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి;
బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి.
7ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి,
మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.
8యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే చెల్లించండి.
అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి.
9తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి;
సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి.
10“యెహోవా పరిపాలిస్తారు” అని జనాంగాలలో ప్రకటించండి,
లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు;
ఆయన జనాంగాలకు న్యాయంగా తీర్పు తీరుస్తారు.
11ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి;
సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి.
ఆయన మహిమను ప్రచురించాలి.
12పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి.
అడవి చెట్లు ఆనందంతో పాటలు పాడాలి.
13యెహోవా రాబోతున్నారు.
భూలోకానికి తీర్పు తీరుస్తారు.
నీతిని బట్టి లోకానికి,
తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 96: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: