1 సమూయేలు 28:7-8
1 సమూయేలు 28:7-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు సౌలు “నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి. నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను” అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు “అలాగే, ఏన్దోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది” అని అతనితో చెప్పారు. సౌలు మారువేషం వేసుకుని వేరే దుస్తులు ధరించి ఇద్దరు సహాయకులను వెంట తీసుకుని వెళ్ళి, రాత్రి సమయంలో ఆ స్త్రీతో “మృతులతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పే వ్యక్తిని రప్పించు” అని కోరాడు.
1 సమూయేలు 28:7-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు సౌలు–నా కొరకు మీరు కర్ణపిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు–చిత్తము, ఏన్దోరులో కర్ణపిశాచము గల యొకతె యున్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వచ్చి–కర్ణపిశాచముద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా
1 సమూయేలు 28:7-8 పవిత్ర బైబిల్ (TERV)
చివరికి సౌలు తన మనుష్యులతో, “ఒక కర్ణపిశాచంగల స్త్రీని వెదకండి. నేను వెళ్లి ఏమి జరుగబోతుందో ఆమెను అడుగుతాను” అని చెప్పాడు. “ఏన్దోరులో కర్ణపిశాచం గల ఒక స్త్రీ వుందని” అతని అధికారులు అతనితో చెప్పారు. అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం వేసుకొని, ఆ రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని ఆ స్త్రీని చూడటానికివెళ్లాడు. “ఆ స్త్రీని దైవావేశంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పిన వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు.
1 సమూయేలు 28:7-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సౌలు తన సహాయకులకు, “మీరు వెళ్లి మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీని వెదకండి, అప్పుడు నేను వెళ్లి ఆమె దగ్గర విచారణ చేస్తాను” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు, “ఎన్-దోరులో ఒక స్త్రీ ఉంది” అని చెప్పారు. కాబట్టి సౌలు మారువేషం వేసుకుని వేరే బట్టలు ధరించి ఇద్దరు మనుష్యులతో పాటు బయలుదేరి రాత్రివేళ ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, “చనిపోయినవారి ఆత్మతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పేవాన్ని రప్పించు” అని అడిగాడు.