యిర్మీయా 9:13-14
యిర్మీయా 9:13-14 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు. వారికి నా ఉపదేశములు ఇచ్చాను. కాని వారు వినటానికి నిరాకరించారు. వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు. యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు. వారు మొండివారు. వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు. బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”
యిర్మీయా 9:13-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా చెప్పేదేమంటే, “దానికి కారణం, వారు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తోసిపుచ్చారు. తమ హృదయంలోని మూర్ఖత్వం ప్రకారం చేశారు. తమ పూర్వికుల దగ్గర నేర్చుకున్నట్టు బయలు దేవుళ్ళను పూజించారు. అందుకే వారి దేశం పాడైపోయింది.”
యిర్మీయా 9:13-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– వారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమపితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.
యిర్మీయా 9:13-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా ఇలా అన్నాడు, “నేను వారి ముందుంచిన నా ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారు; వారు నాకు విధేయత చూపలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. దానికి బదులు, వారు తమ హృదయాల మొండితనాన్ని అనుసరించారు; వారి పూర్వికులు వారికి బోధించినట్లుగా వారు బయలును అనుసరించారు.”