యిర్మీయా 9:23-24
యిర్మీయా 9:23-24 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఇలా చెబుతున్నాడు: “తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి గొప్పలు చెప్పుకోరాదు. బలవంతులు తమ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకోరాదు. శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకోరాదు. ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము. నన్నతను అర్థం చేసుకున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనిమ్ము. యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము. నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.” ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.
యిర్మీయా 9:23-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు. దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి. అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”
యిర్మీయా 9:23-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యిర్మీయా 9:23-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు, అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి: నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని, నేనే యెహోవానని, భూమిపై దయను, న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని, ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.