ప్రకటన 7:15-16
ప్రకటన 7:15-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకే, “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, ఆయన ఆలయంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, కనుక ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాడు తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. ‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు దాహం ఉండదు; సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగులదు,’ ఏ వేడి వారిని కాల్చదు.
ప్రకటన 7:15-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు.
ప్రకటన 7:15-16 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు. వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు.
ప్రకటన 7:15-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందువలనవారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారము వారిమీద కప్పును; వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు
ప్రకటన 7:15-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకే, “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. ‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు దాహం ఉండదు; సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగలదు’ ఏ వేడి వారిని కాల్చదు.