దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

10 యొక్క 10

అసౌకర్యమైన లావాదేవీలలో చిక్కుకొన్నప్పుడు

ఆసాపు ఒక అసౌకర్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అన్యాయం అతనిని దహించి వేస్తుంది. అతని అనుభవం, దేవుని సత్యం సరిపోకపోవడం చూసినప్పుడు పరిణతి చెందిన ఈ వ్యక్తి, దైవభక్తిగల వ్యక్తి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. అతని వేదన, దాని నుండి వచ్చిన ప్రత్యక్షత మనకోసం గుర్తింపదగిన ఈ కీర్తనలో భద్రపరచబడ్డాయి.

 ఆసాపు వ్యక్తం చేసిన ఆలోచనలు మనకు ఒక నమూనాగా ఉన్నాయి. మీరు ఎటువంటి అన్యాయాన్ని అనుభవించినా, ఆ నేరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పదాలను చదవండి. జీవితం అన్యాయంగా ఉన్నదని మీరు కష్టపడుతున్నప్పుడు ప్రతిసారీ అతని మాదిరిని అనుసరించండి. అతను చూపించే నిర్దిష్ట దశలను గమనించండి: (1) మీ హృదయాన్ని దేవుని వద్ద కుమ్మరించండి, (2) మీ ఎంపికలను జాగ్రత్తగా పరిశీలించండి; (3) పెద్ద చిత్రాన్ని చూడండి; (4) మరియు అతనితో మీ సంబంధాన్ని పునరుద్ఘాటించండి. దృక్పథంలో మార్పు మీకు అనిపించే అన్యాయాన్ని శక్తివంతంగా రద్దు చేస్తుంది.

  ఆ సూత్రం ఖచ్చితంగా ఆసాపు కీర్తనలో మలుపు తిరిగేలా చేసింది (వచనాలు 16-17). మనం దేవుని సన్నిధిలోనికి, ఆయన “పరిశుద్ధాలయంలోనికి” అడుగుపెట్టినప్పుడు, ఆయన సత్యం వెలుగులో నిలబడినప్పుడు, మనం శాశ్వతమైన కోణం నుండి విషయాలను చూడటం ప్రారంభిస్తాము. ఆసాపు ఆశను వదులుకునే దశలో ఉన్నాడు-అతని “పాదాలు దాదాపు జారిపోతున్నాయి” (వ.2). అతను ఈ సమయంలో తన పరిస్థితులను మాత్రమే చూశాడు కనుక అతని పాదాలు జారడానికి దగ్గరగా ఉన్నాయి. తన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడంలో, దేవుణ్ణి అనుసరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన భావించారు. అతను భిన్నంగా చూడటానికి దేవుని సన్నిధిని పొందవలసి వచ్చింది. మనం అన్యాయమైన లావాదేవీలమీద దృష్టి పెట్టినప్పుడు, మనం స్వల్ప దృష్టి కలిగిన వారం అవుతాం. మనం వెనక్కి తిరిగి, పెద్ద చిత్రాన్ని చూపించడానికి దేవుణ్ణి అనుమతించినప్పుడు, మన కష్టాలు శాశ్వత వెలుగులో ఎంత క్షణికమైనవో గుర్తిస్తాము, మనల్ని మనం అంతంలో ఉంచుకొని ఉంచి తిరిగి వెనుకకు చూస్తే, “మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను.” (రోమా 8:18).

  

మీ స్వభావాన్ని కట్టుకోడానికీ, మీ జీవితాన్ని మార్చడానికీ, మీకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వడానికీ, గొప్ప ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి దేవుడు మీరు అసౌకర్యమైన లావాదేవీలను ఉపయోగిస్తాడు. అయితే మీరు అక్కడే ఉండి, మంచి ముగింపు తీసుకురావాలని ఆయనను విశ్వసించాలి. వర్తమానంలో అర్ధవంతంగా లేని సంఘటనలను భరించడానికి విశ్వాసం కలిగియున్డడానికి ఒకే మార్గం, మీ దృష్టిని పరిస్థితుల నుండి దూరంగా చేసి, పెద్ద చిత్రంలోకి మారిపోవడమే. సమస్తమూ మేలు కోసం సమకూడి జరుగుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. (రోమా 8:28). చివరికి, మీ అసౌకర్యమైన లావాదేవీలు వాస్తవానికి మేలుకరమైన ఒప్పందాలుగా మారుతాయి. 

వాక్యము

రోజు 9

ఈ ప్రణాళిక గురించి

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయి, దేవుని సన్నిధీ, శక్తీ, సమకూర్పును గూర్చిన సాక్ష్యంతో అవి ముగుస్తాయి. వాటిలోని సత్యాలను నేర్చుకోవడం, వాటి మాదిరులను అనుసరించడం ద్వారా మనమూ అదే సాక్ష్యాన్ని కలిగి యుండగలం. దేవుడు మనకు ఎక్కువగా కావలసిన సమయంలో ఆయనను మనం పొందగలం.

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/