దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

10 యొక్క 2

చీకటి లోయలలో

ప్రతి సంవత్సరంలో కొంత భాగం, ఒక గొర్రెల కాపరి తన మందలను లోతట్టు ప్రాంతాలలోనికి తీసుకొని వెళ్తాడు, అక్కడ పచ్చికబయలు మంచిగా ఉంటుంది. పర్వతాలలో వాతావరణం మారినప్పుడూ, పచ్చని గడ్డి పెరిగినప్పుడూ, గొర్రెల కాపరి తన గొర్రెలను కొండ కనుమలూ, లోయల ద్వారా ఎత్తైన ప్రదేశాలకు తీసుకువెళతాడు. గమ్యం అద్భుతంగా ఉంటుందని ఆయనకు తెలుసు.

 అయితే ప్రయాణం కొద్దిగా మోసపూరితంగా ఉంటుంది. ఆ నీడ లోయలలో వాటిని చంపి తినే జంతువులు దాగిఉంటాయి. గొర్రెల మంద రాబోతున్న భయాన్ని గ్రహించగలదు, అవి తమ గొర్రెల కాపరి అప్రమత్తతపై పూర్తిగా ఆధారపడతాయి. తోడేళ్ళూ, సింహాలూ వాటికి కావలసిన ఎరను ఊహించి దాక్కున్న మూలలు, పగుళ్ల గురించి కాపరి తెలుసుకోవాలి. అతడు లేకుండా, లోయ మరణ ప్రదేశంగా మారుతుంది. అతనితో, ఇది జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే.

 తెలియనిదీ, ప్రమాదకరమైనదీ అయిన ఈ భూభాగాన్ని దావీదు " గాఢాంధకారపు లోయ” అని పేర్కొంటున్నాడు. (వచనం 4) మన చుట్టూ ఏమి జరుగుతుందో మనకు అర్ధం కానప్పుడు మనం వెళ్ళే చీకటి సమయాలను గురించి ఆయనకు బాగా తెలుసు. ఈ చిత్రంలో సూచించిన వాగ్దానం ఏమిటంటే, మనం ఎదుర్కొనే ఏ సంక్షోభంలోనైనా దేవుడు మనలను తీసుకువెళతాడు, అది ఎంత భయంకరమైనదీ లేదా ప్రమాదకరమైనదీ అయినా. మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన గొర్రెల కాపరి అడుగడుగునా మనతో నడుస్తున్నాడు.

 “కీడుకు భయపడను”అని పలికిన దావీదు ధైర్యం ఒక విప్లవాత్మకమైన ప్రకటన. పతనమైపోయిన ఈ లోకం ఎంత ప్రమాదకరమైనదో ఆయనకు తెలుసు, అయితే మనం భయపడటానికి అప్పగించడంలో ఆయన నిరాకరించాడు. సాధ్యం కాగలిగే ప్రతీ అడవి జంతువూ, ప్రకృతి విపత్తు, ప్రమాదం, దానినుండి తప్పించడం గురించి తెలుసుకోవడానికి ఆయన కేవలం ధైర్యంగానూ, సహజంగానూ దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు. కాపరి శక్తి దుడ్డుకర్ర, ఆయన దిద్దుబాటు అయిన దండం ఆయనను ఆదరిస్తాయి, అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కూడా అతనికి ఓదార్పునిస్తారు.

జీవితం అనిశ్చితంగా ఉన్నప్పుడు, ప్రమాదాలు బెదిరించినప్పుడు, మీరు పరివర్తన సమయాలను భరిస్తున్నప్పుడు, భయపడటానికి నిరాకరించండి. దావీదు ప్రకటన నుండి నేర్చుకోండి. నిర్భయమైన జీవనం మనకు చట్టబద్ధమైన ఎంపిక, ఎందుకంటే గొర్రెల కాపరి చీకటి లోయల ద్వారా కూడా మనలను నడిపిస్తున్నాడు. అయితే మనం దానిని ఎన్నుకోవాలి. మన గొర్రెల కాపరితో దశలవారీగా జీవితపు చీకటి లోయల గుండా నడిచినప్పుడు, మనలను నడిపిస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నేరవేరుస్తాడు.

వాక్యము

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయి, దేవుని సన్నిధీ, శక్తీ, సమకూర్పును గూర్చిన సాక్ష్యంతో అవి ముగుస్తాయి. వాటిలోని సత్యాలను నేర్చుకోవడం, వాటి మాదిరులను అనుసరించడం ద్వారా మనమూ అదే సాక్ష్యాన్ని కలిగి యుండగలం. దేవుడు మనకు ఎక్కువగా కావలసిన సమయంలో ఆయనను మనం పొందగలం.

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/