దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా
మీరు నిరాశకు గురైనప్పుడు
నేను ఒప్పుకుంటున్నాను. నేను నిరాశకు గురయ్యాను. లోతైన, చీకటి సమయాలనుండీ వెళ్ళిన బైబిలు వ్యక్తులు దావీదు, యోనా, ఏలీయా, యిర్మియా, ఇతరుల జీవితాలను పరిశీలించినట్లయితే – నిరాశ అనేది క్రైస్తవుల మధ్య సాధారణ చర్చనీయాంశంగా ఉండాలి. విచారకరంగా తరచుగా ఇది వైపరీత్యంగా కనిపిస్తుంది. అయినా అనేకమంది మనుష్యులు ఒత్తిడినీ, అలసటనూ, నిరుత్సాహాన్నీ, తీవ్రమైన నిరాశాకూ లేదా భంగపడిపోడానికీ దారి తీసే ప్రేరణ లేమినీ అనుభవిస్తున్నారు. జీవితంలో నేను తిరిగి నన్ను నేను తెచ్చుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, ఆశాభావంలోని చిరు మెరుపులను చూడటం మొదలు పెట్టేంత వరకూ నేను చాలా కాలం పాటు స్పర్శరహితంగానూ, అలసిపోయినట్టుగానూ, ఆసక్తిలేని అనుభూతిని పొందినట్టుగా ఉండిపోయాను. పతనమైన లోకంలో ఇవి అసాధారణమైన అనుభవాలు కావు.
ఆత్మలో ప్రతి సమయాన్నీ, వాటి నుండి వచ్చే హృదయపూర్వక ప్రార్థనలను లేఖనం మనకు చూపిస్తుంది. అటువంటి ప్రార్థనలలో 77 వ కీర్తన ఒకటి. ఇది మానవ నిరాశను మాత్రమే కాకుండా దాని నుండి వెలుపలికి రాలేమని మనకు అనిపించిన పరిస్థితినుండి బయటపడటానికి ఒక మార్గాన్ని కూడా తెలియజేస్తుంది. దేవుడు మాయజాలంతో నివారణ లేదా ఒక్క పరిమాణంలోనే అన్ని పరిష్కారాలను అందించడు; నిరాశ సంక్లిష్టమైనది, దాని నుండి ప్రజలకు ఆయన వివిధ మార్గాల్లో సహాయం చేస్తాడు. అయితే ఈ కీర్తన వారందరికీ సాధారణమైన కొన్ని సూత్రాలను అందిస్తుంది.
దేవునికి మొఱ్ఱ పెట్టడంతో ఈ కీర్తన రచయిత ఆసాపు ఆరంభిస్తున్నాడు. (వచనాలు 1-3) అక్కడ నుండి, అద్భుతమైన పురోగతిని మనం చూస్తాము. గత ఆశీర్వాదాలను గుర్తుచేసుకొంటూ మొఱ్ఱ పెట్టడం నుండి (వచనాలు 4-6), తరువాత దేవుణ్ణి కఠినమైన ప్రశ్నలను అడగడం (వచనాలు 7-9), మన మన ఆలోచనలను దారి మళ్లించడానికి ఎంచుకోవడం (వచనాలు 10-12), దేవుణ్ణి మహోన్నతునిగా చూడడం, సమస్యలను చిన్నవిగా చూడాలని యెంచుకోవడం (వచనాలు 13-18), ఆపై దేవుణ్ణి మన విమోచకుడిగా విశ్వసించడం (వచనాలు 19-20)తో కీర్తన ముగుస్తుంది. ఈ బదిలీ ప్రక్రియ దృక్ఫథం మన మనసులనూ, మన ఆత్మలనూ భిన్నంగా ఆలోచించడానికీ, భిన్నంగా చూడడానికీ తర్ఫీదు ఇస్తుంది. ఈ ఆలోచన ప్రక్రియను మనం మన జీవితంలోకి పని చేయ్యనిచ్చినప్పుడు, నిరాశ చాలా తరచుగా తొలగిపోవడం ఆరంభం అవుతుంది.
నిరాశ దాని చివరి కోణాలలో ఎటువంటి కాంతి లేకుండా చల్లని, చీకటి సొరంగం లాగా ఉంటుంది. మనస్సు చాలా చెడ్డ విషయాలు వైపు మొగ్గు చూపడం, భవిష్యత్తు అదే విధంగా ఉంటుందని తేల్చి చెప్పడం సులభం. చీకటి నుండి వెలుగు వరకు, ప్రస్తుత పరిస్థితుల నుండి గత కరుణల వరకు, సమస్యల నుండి వాగ్దానాల వరకు, జరిగే పునశ్చరణ మాత్రమే మనలను బయటకు తీసుకురాగలదు. ఆసాపు మాదిరిగానే, మనమూ ఒక మానసిక సమయాన్ని తీసుకొని విభిన్నమైన ఆలోచనలను ఎన్నుకుంటాము: “నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.” (వ.12). మన ఆలోచనలను సరైన దారిలో ఉంచడానికి తీసుకొనే ఈ ఉద్దేశపూర్వక ఎంపిక, అది మనకు మంచిదిగా అనిపించినా లేకపోయినా, అది మన దృక్పథాన్ని మార్పు చేస్తుంది. వెలుగుకు చీకటి మార్గం ఇవ్వడం ప్రారంభిస్తుంది
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయి, దేవుని సన్నిధీ, శక్తీ, సమకూర్పును గూర్చిన సాక్ష్యంతో అవి ముగుస్తాయి. వాటిలోని సత్యాలను నేర్చుకోవడం, వాటి మాదిరులను అనుసరించడం ద్వారా మనమూ అదే సాక్ష్యాన్ని కలిగి యుండగలం. దేవుడు మనకు ఎక్కువగా కావలసిన సమయంలో ఆయనను మనం పొందగలం.
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/