దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

10 యొక్క 7

గందరగోళం సమయంలో 

గొప్ప గ్రీన్ బే ప్యాకర్స్ శిక్షకుడు విన్స్ లోంబార్డి ప్రాధమిక సూత్రాల పట్ల తనకున్న నిబద్ధతకు ప్రసిద్ది చెందారు. అతడు ప్రతి ఫుట్‌బాల్ క్రీడా సమయంలో ఒక బంతిని పట్టుకొని తన జట్టుకు ఇలా చెపుతాడు, వారిలో అందరూ వృత్తిపర క్రీడా నిపుణులు, “ఈ పెద్దమనిషి ఒక ఫుట్‌బాల్.” అప్పుడు బృందం అంతా మొదటి రెండు వారాలు ఏమీ చేయకుండా గడుపుతారు, తరువాత బంతిని నిరోధించడం, స్వాధీనం చెయ్యడం నేర్చుకొంటారు.

మనం గందరగోళ సమయాలలోనుండి వెళ్తున్నప్పుడు, కొన్నిసార్లు ఉత్తమమైన పరిష్కారం మనం ప్రాథమిక సూత్రాలకు తిరిగి వెళ్ళడమే. అధికంగానూ, సంక్లిష్టంగానూ పెరిగిన పరిస్థితులకు స్పష్టత తీసుకురావడానికి దేవుడు నా పరిచర్యలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఆలోచన కర్తలు, శిక్షకులు, సలహాదారులను ఉపయోగించాడు. మనం ఎక్కడున్నామో, ఎక్కడికి వెళ్ళాలో, అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవటానికి గందరగోళ పరిస్థితుల్లో మనందరికీ జ్ఞానం, వివేచన అవసరం.

 90 వ కీర్తనలో మోషే చెప్పిన మాటలు మనకు అటువంటి ఆలోచనలను చెప్పి నడిపిస్తుంది. అతడు మనలను  ప్రాథమిక సూత్రాలకు తీసుకువెళతాడు. అతడు ఐగుప్తు నుండి దేవుని ప్రజలను అరణ్యం మార్గం నుండి వాగ్దాన భూమి అంచు వరకు నడిపించినప్పుడు అనేకసార్లు అధిక ఒత్తిడినీ, తీవ్రమైన అలసటనూ అనుభవించాడు. ఇక్కడ రచయిత ఆరు సంక్షిప్త సూత్రాలలో జ్ఞాన జీవితాన్ని సంక్షిప్తీకరిస్తాడు: దేవుడు గొప్పవాడు (వచనాలు 1-2), జీవితం స్వల్పమైనది (వచనాలు 3-6), పాపం తీవ్రమైనది (వచనాలు 7-11), జ్ఞానం అవసరం (వ.12), కరుణ అందుబాటులో ఉంది (వచనాలు 13-15), విజయం సాధ్యమే (వచనాలు 16-17). ఈ సూత్రాలలోని అంతర్సూచనలను చేరడం చాలా సమయం పడుతుంది. అవి జీవితాలను మార్చేవి. దేవుడు గొప్పవాడైతే, ఆయనతో సంబంధం కలిగి ఉండటం అత్యంత ఉన్నతమైన ప్రాముఖ్యత కలిగింది. జీవితం చిన్నది అయితే, శాశ్వతత్వం వెలుగులో జీవించడం మనం చేయగలిగే అత్యంత జ్ఞానయుక్తమైన కార్యం. పాపం తీవ్రంగా ఉంటే, దానిని మన జీవితాల నుండి తొలగించడం చాలా కీలకం. మనం జ్ఞానాన్ని హత్తుకొన్నట్లయితే మన ప్రాధాన్యతలు మార్పు చెందుతాయి. మన జీవితాలను గడపడం కంటే దానిని పెట్టుబడిగా పెట్టడం నేర్చుకుంటాము. కరుణ అందుబాటులో ఉంటే దానిని సమృద్ధిగా స్వీకరించడానికీ, స్వేచ్ఛలోనూ, ఆనందంతోనూ జీవించడానికి మనం ఎంచుకోవచ్చు. విజయం నిజంగా సాధ్యమైతే, క్షేమం కోసం మన ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశాలను దేవుడు ఇస్తాడు.

సంక్షిప్తమైనవీ అయితే శక్తివంతమైన ఈ సూత్రాలు గందరగోళాన్ని తొలగిస్తాయి. అవి మన దిశకు స్పష్టతను తెస్తాయి, ఉద్దేశ్యంతోనూ, ఫలప్రదంగా జీవించడానికి బలపరుస్తాయి. అవి మనలను అవగాహనలోనికి నడిపించే ప్రాథమిక అంశాలు. మనం ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికీ, జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడకు వెళ్ళడానికి ఇవి సిద్ధపరుస్తాయి. 

వాక్యము

రోజు 6రోజు 8

ఈ ప్రణాళిక గురించి

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయి, దేవుని సన్నిధీ, శక్తీ, సమకూర్పును గూర్చిన సాక్ష్యంతో అవి ముగుస్తాయి. వాటిలోని సత్యాలను నేర్చుకోవడం, వాటి మాదిరులను అనుసరించడం ద్వారా మనమూ అదే సాక్ష్యాన్ని కలిగి యుండగలం. దేవుడు మనకు ఎక్కువగా కావలసిన సమయంలో ఆయనను మనం పొందగలం.

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/