నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్నమూనా

పురోగమనం
భయం విశ్వాసాన్ని కలుసుకున్నప్పుడు
“గాలిని చూచి భయపడి మునిగిపోసాగి -ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను.” ఈ కీలకమైన సమయం భయం గురించి, విశ్వాసంగురించి గంభీరమైన సూక్ష్మవిషయాలను మనకు తెలియజేస్తుంది. గాలి హఠాత్తుగా ఎక్కువ కాలేదని గమనించండి. పేతురు యేసును చూడడంకంటె ఎక్కువగా గాలిని గమనించాడు.
“చూచి” అనే పదానికి మూలభాషలో ఉన్న పదం కేవలం కళ్లతో చూడడాన్ని మించిన భావాన్ని తెలియ జేస్తుంది; పేతురు గాలిని పరిశీలిస్తున్నాడని, దానిగురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడని, దానికి ప్రాముఖ్యత నిస్తున్నాడని సూచిస్తుంది. ఏకాగ్రతలో వచ్చిన ఈ మార్పు వెంటనే ఫలితాలను చూపించింది: విశ్వాసం స్థానంలోకి భయం వచ్చింది, నడక స్థానంలోకి మునిగిపోవడం వచ్చింది.
అయితే పేతురు దిగజారడంలో కూడ ఒక చక్కని విషయం కనబడుతుంది. “ప్రభువా, నన్ను రక్షించుము” అని అతను కేకలు వేశాడు, ఇవి కేవలం మూడు పదాలు మాత్రమే కాదు (గ్రీక్ లో అంతకంటె తక్కువ సైతం ఉండవచ్చు), అయినప్పటికి క్లిష్టసమయంలో ఎటువైపు చూడాలో పేతురుకు కచ్చితంగా తెలుసని ఈ మాటలు రూఢిగా తెలియజేస్తున్నాయి. నిస్సహాయ సమయాలలో ఆడంబరమైన మాటలు అవసరం లేదని అతని ప్రార్థనలోని క్లుప్తత మనకు గుర్తుచేస్తుంది – యేసువైపు చూచే యథార్థహృదయం చాలు.
ప్రార్థనాంశాలు:
మీ ఏకాగ్రతతో ఏ అన్యమనస్కతలు లేదా పరధ్యానాలు పొటీపడుతున్నాయి?
మీరు మునిగిపోతున్నప్పుడు ఎంత త్వరగా యేసుకు మొరపెడ్తున్నారు?
భయం కలిగిన సమయాలలో మీ విశ్వాసాన్ని బలపర్చమని దేవుడిని ప్రార్థించండి.
మీరు మునిగిపోవడం మొదలుకావడాన్ని గుర్తించే వివేకం కొరకు ప్రార్థించండి.
వ్యక్తిగత అనువర్తన:
“భయం - విశ్వాసం” పరిశీలన పటం
1.రెండు నిలువ గడులను (కాలమ్న్స్) గీయండి.
భయం గడి: మీ ప్రస్తుత భయాలను వ్రాయండి.
విశ్వాసం గడి: ప్రతి ఒక భయాన్ని ఎదుర్కొనే దేవునివాక్యంలోని సత్యాన్ని వ్రాయండి.
2.ఈ పట్టికను రోజంతా అందుబాటులో ఉండే చోట ఉంచండి.
మననంకొరకు ప్రశ్నలు:
పేతురును కాపాడడానికి ముందు అతను మునిగిపోవడానికి ఎందుకు యేసు అనుమతించాడని మీరను కుంటున్నారు?
పేతురు కేకకు యేసుయొక్క ప్రతిస్పందనలోని వేగంనుండి మనం ఏమి నేర్చుకొనగలం?
మీ విశ్వాసాన్ని బలపర్చడానికి మీరు భయపడిన గతసమయాలను ఎట్లా దేవుడు ఉపయోగించు కున్నాడు?
ఈ ప్రణాళిక గురించి

“నన్ను ఆజ్ఞాపించు.” ఎదురుగాలి నడుమ అటూ ఇటూ ఊగిపోతున్న దోనెలోనుండి పైకి ఎగసిపడు తున్న నీళ్లలోకి అడుగుపెట్టిన పేతురు జీవితం ఈ రెండు పదాలతో మారిపోయింది. దోనెనుండి యేసు దగ్గరకు అతని ప్రయాణం విశ్వాసం, ఏకాగ్రత మరియు పురోగమనం గురించి శాశ్వత సత్యాలను వెల్లడి చేస్తుంది. ఈ 4-రోజుల దైవధ్యానం మత్తయి 14:28-33 వచనాలను అన్వేషిస్తూ, మీరు యేసు పిలుపును గుర్తించడానికి, విశ్వాసంతో భయాన్ని అధిగమించడానికి మరియు తదేకదృష్టితో ఆయనను చూచే ఏకాగ్రతకు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు దోనె అంచున ఉన్నా గానీ లేదా నీళ్లమీద నడవడం నేర్చు కుంటున్నా గానీ, “నన్ను ఆజ్ఞాపించు” అని సాధారణ విశ్వాసులు ధైర్యంతో చెప్పినప్పుడు ఏమి జరుగు తుందో తెలుసుకుంటారు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు Zero కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.zeroconferences.com/india