1
1 పేతురు పత్రిక 3:15-16
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు.
Compare
Explore 1 పేతురు పత్రిక 3:15-16
2
1 పేతురు పత్రిక 3:12
ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
Explore 1 పేతురు పత్రిక 3:12
3
1 పేతురు పత్రిక 3:3-4
జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది.
Explore 1 పేతురు పత్రిక 3:3-4
4
1 పేతురు పత్రిక 3:10-11
జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.
Explore 1 పేతురు పత్రిక 3:10-11
5
1 పేతురు పత్రిక 3:8-9
చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి. కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
Explore 1 పేతురు పత్రిక 3:8-9
6
1 పేతురు పత్రిక 3:13
మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు?
Explore 1 పేతురు పత్రిక 3:13
7
1 పేతురు పత్రిక 3:11
అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.
Explore 1 పేతురు పత్రిక 3:11
8
1 పేతురు పత్రిక 3:17
కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.
Explore 1 పేతురు పత్రిక 3:17
Home
Bible
Plans
Videos