1
ఫిలిప్పీ పత్రిక 4:6
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి.
Compare
Explore ఫిలిప్పీ పత్రిక 4:6
2
ఫిలిప్పీ పత్రిక 4:7
అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది.
Explore ఫిలిప్పీ పత్రిక 4:7
3
ఫిలిప్పీ పత్రిక 4:8
చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి.
Explore ఫిలిప్పీ పత్రిక 4:8
4
ఫిలిప్పీ పత్రిక 4:13
నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.
Explore ఫిలిప్పీ పత్రిక 4:13
5
ఫిలిప్పీ పత్రిక 4:4
ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి.
Explore ఫిలిప్పీ పత్రిక 4:4
6
ఫిలిప్పీ పత్రిక 4:19
నా దేవుడు తన మహిమైశ్వర్యం ఆధారంగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు.
Explore ఫిలిప్పీ పత్రిక 4:19
7
ఫిలిప్పీ పత్రిక 4:9
మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.
Explore ఫిలిప్పీ పత్రిక 4:9
8
ఫిలిప్పీ పత్రిక 4:5
మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు.
Explore ఫిలిప్పీ పత్రిక 4:5
9
ఫిలిప్పీ పత్రిక 4:12
దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను.
Explore ఫిలిప్పీ పత్రిక 4:12
10
ఫిలిప్పీ పత్రిక 4:11
నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను.
Explore ఫిలిప్పీ పత్రిక 4:11
Home
Bible
Plans
Videos