1 తిమోతికి 3
3
1ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. 2-3అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యా దస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వి కుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, 4సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. 5ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? 6అతడు గర్వాంధుడై అపవాదికి#3:6 అనగా, సాతానుకు. కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. 7మరియు అతడు నిందపాలై అపవాది#3:7 అనగా, సాతానుకు. ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను. 8ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును,#3:8 లేక, రెండు నాలుకలుగలవారు. మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము న పేక్షించువారునైయుండక 9విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను. 10మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. 11అటువలె పరిచర్యచేయు స్త్రీలును#3:11 వారి భార్యలును. మాన్యులై కొండెములు చెప్పనివారును,#3:11 మూలభాషలో–అపవాదులును. మితాను భవముగలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను. 12పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను. 13పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యముగలవారగుదురు.
14శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను; 15అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జను లేలాగు#3:15 లేక, నీవేలాగు. ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది. 16నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;
ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.
ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను
దేవదూతలకు కనబడెను
రక్షకుడని జనములలో ప్రకటింపబడెను
లోకమందు నమ్మబడెను
ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
Currently Selected:
1 తిమోతికి 3: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.