YouVersion Logo
Search Icon

యెషయా 12

12
1ఆ దినమున మీరీలాగందురు
–యెహోవా, నీవు నామీద కోపపడితివి
నీ కోపము చల్లారెను
నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి
యున్నావు.
2ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు,
నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను
యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే
నా కీర్తనకాస్పదము
ఆయన నాకు రక్షణాధారమాయెను
3కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు
లలోనుండి నీళ్లు చేదుకొందురు
ఆ దినమున మీరీలాగందురు
4–యెహోవాను స్తుతించుడి ఆయన నామమును
ప్రకటించుడి
జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి
ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు
కొనుడి.
5యెహోవానుగూర్చి కీర్తన పాడుడి
ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను
భూమియందంతటను ఇది తెలియబడును.
6సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము
నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు
ఘనుడై యున్నాడు.

Currently Selected:

యెషయా 12: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యెషయా 12