YouVersion Logo
Search Icon

యెషయా 15

15
1మోయాబునుగూర్చిన దేవోక్తి
–ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును
ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును
2ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న
దీబోనుకును వెళ్లుచున్నారు
నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు
ప్రలాపించుచున్నారు
వారందరి తలలమీద బోడితనమున్నది
ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది
3తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురువారి మేడలమీదను వారి విశాలస్థలములలోను
వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు
దురు.
4హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి
యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది
మోయాబీయుల యోధులు కేకలువేయుదురు
మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.
5మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది
దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు
వరకు పారిపోవుదురు
లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు
నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొ
నయీము త్రోవను పోవుదురు.
6ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను
అది ఇంకను అడవిగా ఉండును.
గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి
పచ్చనిది ఎక్కడను కనబడదు
7ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన
పదార్థములను
నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని
పోవుదురు.
8రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను
అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును
వినబడెను.
9ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను.
మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పిం
చెదను.
మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని
ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును
రప్పించెదను.

Currently Selected:

యెషయా 15: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యెషయా 15