యెషయా 5
5
1నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి
అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి
పాడెదను వినుడి.
సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొక
ద్రాక్షతోట యుండెను
2ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో
శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను
దానిమధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష
తొట్టిని తొలిపించెను.
ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను
గాని అది కారుద్రాక్షలు కాచెను
3కావున యెరూషలేము నివాసులారా, యూదావార
లారా,
నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ
వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.
4నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి
దానికి చేయగలను?
అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు
అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?
5ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు
కార్యమును మీకు తెలియజెప్పెదను
నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి
వేసెదను.
అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని
పాడుచేసెదను
6అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు
దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును
దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.
7ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు
యెహోవా ద్రాక్షతోట
యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము.
ఆయన న్యాయము కావలెనని చూడగా బలా
త్కారము కనబడెను
నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.
8స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో
నివసించునట్లు
ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు
కొను మీకు శ్రమ.
9నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు
యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల
విచ్చెను.
–నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు
అనేకములు నివాసులులేక పాడైపోవును.
10పది ఎకరముల#5:10 కాండ్లు. ద్రాక్షతోట ఒక కుంచెడు రస
మిచ్చును
తూమెడుగింజల పంట ఒక పడి యగును.
11మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము
తమకు మంట పుట్టించువరకు చాల రాత్రివరకు
పానముచేయువారికి శ్రమ.
12వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను
వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు
చేయుదురుగాని యెహోవా పని యోచింపరు
ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.
13కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి
పోవుచున్నారు
వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు
సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.
14అందుచేతనే పాతాళము గొప్ప ఆశపెట్టుకొని అపరి
మితముగా తన నోరు తెరచుచున్నది
వారిలో ఘనులును సామాన్యులును
ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.
15అల్పులు అణగద్రొక్కబడుదురు
ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును
16సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి
మహిమపరచబడును
పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధపరచు
కొనును.
17అది మేతబీడుగానుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట
మేయును
గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు
అనుభవింతురు.
18భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొనువారికి శ్రమ.
బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమవారు ఇట్లనుకొనుచున్నారు
19–ఆయనను త్వరపడనిమ్ము
మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను
దానిని వెంటనే చేయనిమ్ము
ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు
తెలియబడునట్లు
అది మా యెదుట కనబడనిమ్ము
20కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి
వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారి శ్రమ.
చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి
శ్రమ.
21తమ దృష్టికి తాము జ్ఞానులనియు
తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు
కొనువారికి శ్రమ.
22ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని
మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.
23వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని
తీర్పు తీర్చుదురు
నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.
24సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మ
శాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు
ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీక
రించుదురు.
కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయు
నట్లు
ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లిపోవునువారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.
25దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద
మండుచున్నది.
ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని
కొట్టగా పర్వతములు వణకుచున్నవి.
వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి
యున్నవి.
ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు
ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
26ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు
ధ్వజము నెత్తును
భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల
గొట్టును
అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.
27వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను
లేడు.
వారిలో ఎవడును నిద్రపోడుకునుకడు
వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు
తెగిపోదు.
28వారి బాణములు వాడిగలవివారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి
వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన
ములువారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును
29ఆడుసింహము గర్జించినట్లువారు గర్జించుదురు
కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు
వేటను పట్టుకొని అడ్డమేమియులేకుండ దానిని
ఎత్తుకొని పోవుదురు
విడిపింపగలవాడెవడును ఉండడు.
30వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద
గర్జనచేయుదురు
ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు
కనబడును
అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటి
యగును.
Currently Selected:
యెషయా 5: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.