యెషయా 8
8
1మరియు యెహోవా–నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్, హాష్ బజ్,#8:1 మూలభాషమాటలు–త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్లపట్టబడును. అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయుము. 2నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యా కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా 3నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా– అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్#8:3 అనగా, త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్లపట్టబడును. అను పేరు పెట్టుము. 4ఈ బాలుడు–నాయనా అమ్మా అని అననేరకమునుపు అష్షూరురాజును అతని వారును దమస్కుయొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.
5-6మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను–ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు. 7కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును. 8అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.
9జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు;
దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి
మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు
నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.
10ఆలోచనచేసికొనినను అది వ్యర్థమగును
మాట పలికినను అది నిలువదు.
దేవుడు మాతోనున్నాడు.
11ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను 12–ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడివారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు
పడకుడి.
13సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను
కొనుడి
మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే
దిగులుపడవలెను
అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
14అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ
ములకు తగులు రాయిగాను
అభ్యంతరము కలిగించు బండగాను ఉండును
యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను
ఉండును
15అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు
చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
16ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను
ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.
17యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి
కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు
చున్నాను
ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.
18ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయులమధ్య ఉన్నాము.
19వారు మిమ్మును చూచి–కర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా? 20ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు. 21అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు; 22భూమితట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.
Currently Selected:
యెషయా 8: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.