యిర్మీయా 50
50
1బబులోనునుగూర్చియు కల్దీయుల దేశమునుగూర్చియు ప్రవక్తయైన యిర్మీయాద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు
2–జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి
ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి
బబులోను పట్టబడును బేలు అవమానము నొందును
మెరోదకు నేల పడవేయబడును
బబులోను విగ్రహములు అవమానము నొందును
దాని బొమ్మలు బోర్లద్రోయబడును
3ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చుచున్నది
ఏ నివాసియులేకుండ అది దాని దేశమును పాడు చేయును
మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు
అందరును తరలిపోవుదురు.
4ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదావారును కూడి వచ్చెదరు
ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద
విచారించుటకై వచ్చెదరు
5ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని
యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు
సీయోనుతట్టు అభిముఖులై అచ్చటికి వెళ్లు మార్గము
ఏదని అడుగుచు వచ్చెదరు
ఇదే యెహోవా వాక్కు.
6నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారువారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని
పోయి వారిని త్రోవ తప్పించిరి
జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన
చోటు మరచిపోయిరి.
7కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరివారి శత్రువులు–మేము అపరాధులము కాము
వీరు న్యాయమునకు నివాసమును తమపితరులకు
నిరీక్షణాధారమునగు యెహోవామీద
తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని
చెప్పుదురు.
8బబులోనులోనుండి పారిపోవుడి
కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి
మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు
ముందర నడువుడి.
9ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును
నేను రేపుచున్నాను
బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను
ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు
వారి మధ్యనుండియే ఆమె పట్టబడును
ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక
మరలని రీతిగా
వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.
10కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను
వారందరు సంతుష్టి నొందెదరు
ఇదే యెహోవా వాక్కు.
11నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా,
సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు
పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె
మీరు సకిలించుచున్నారే?
12మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్ల
బోవును
ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును
అది యెడారియు ఎండినభూమియు అడవియునగును.
13యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును
అది కేవలము పాడైపోవును
బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి
దాని తెగుళ్లన్నియు చూచి–ఆహా నీకీగతి పెట్టి
నదా? అందురు
14ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది.
విల్లు త్రొక్కువారలారా,
మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు
యుద్ధపంక్తులు తీర్చుడి
ఎడతెగక దానిమీద బాణములు వేయుడి
15చుట్టు కూడి దానినిబట్టి కేకలువేయుడి
అది లోబడ నొప్పుకొనుచున్నది
దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు
విరుగగొట్టబడుచున్నవి
ఇది యెహోవాచేయు ప్రతికారము.
దానిమీద పగతీర్చుకొనుడి
అది చేసినట్టే దానికి చేయుడి.
16బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము
చేయుడి
కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము
చేయుడి
క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ
ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు
తమతమ దేశములకు పారిపోవుచున్నారు.
17ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు
సింహములు వారిని తొలగగొట్టెను
మొదట అష్షూరురాజు వారిని భక్షించెను
కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి
యెముకలను నలుగగొట్టుచున్నాడు.
18కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు
నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–అష్షూరు రాజును నేను దండించినట్లు
బబులోనురాజును అతని దేశమును దండించెదను.
19ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి
రప్పించెదనువారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు
ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు
సంతుష్టినొందును.
20ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును
వెదకినను అది కనబడకుండును.
యూదా పాపములు వెదకిను అవి దొరుకవు
శేషింపజేసినవారిని నేను క్షమించెదను
ఇదే యెహోవా వాక్కు.
21దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము
పెకోదీయుల దేశముమీదికి పొమ్ము
వారిని హతముచేయుమువారు శాపగ్రస్తులని ప్రకటించుము
నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము.
22ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది
అధిక నాశనధ్వని వినబడుచున్నది
23సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ
గొట్టబడెను
అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను.
24బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి
యున్నాను
తెలియకయే నీవు పట్టబడియున్నావు
యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి
నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.
25కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియు
నగు యెహోవాకు పనియున్నది
యెహోవా తన ఆయుధశాలను తెరచి
కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు
చున్నాడు.
26నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి
దాని ధాన్యపుకొట్లను విప్పుడి
కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి
శేషమేమియులేకుండ నాశనము చేయుడి
27దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను
అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను
వారి దండనకాలము వచ్చెను.
28ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి
తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడుచున్నది
మన దేవుడగు యెహోవాచేయు ప్రతికార సమా
చారమును
తన ఆలయము విషయమై ఆయనచేయు ప్రతికార
సమాచారమును సీయోనులో ప్రకటించుడి.వారు వచ్చుచున్నారు.
29బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి
విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు
దిగుడి.
అది యెహోవామీద గర్వపడినది
ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది
దానిలో నొకడును తప్పించుకొనకూడదు
దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి
అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము
చేయుడి.
30కావున ఆ దినమున దాని యౌవనస్థులు దాని వీధులలో
కూలుదురు
దాని యోధులందరు తుడిచివేయబడుదురు
ఇదే యెహోవా వాక్కు.
31ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా
వాక్కు ఇదే
–గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను
నీ దినము వచ్చుచున్నది
నేను నిన్ను శిక్షించుకాలమువచ్చుచున్నది
32గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును
అతని లేవనెత్తువాడెవడును లేకపోవును
నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను
అది అతని చుట్టుపెట్టులన్నిటిని కాల్చివేయును.
33సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు
–ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదావారును బాధింపబడిరి
వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు
వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు.
34వారి విమోచకుడు బలవంతుడు
సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు
భూమికి విశ్రాంతి కలుగజేయుటకును
బబులోను నివాసులను కలవరపరచుటకును
ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ
ముట్టించును.
35యెహోవా మాట యిదే
కల్దీయులును బబులోను నివాసులును
దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు
36ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగు
దురు.
బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద
పడును
37ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల
మీద పడును
ఖడ్గము వారిమీదికి దిగుటచేత
దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు
అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.
38నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును
అది చెక్కబడిన విగ్రహములుగల దేశము
జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
39అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివ
సించును
నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును
ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును
తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
40యెహోవా వాక్కు ఇదే
–సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను
దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా
ఎవడును అక్కడ కాపురముండకపోవును
ఏ నరుడును దానిలో బసచేయడు.
41జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు
మహాజనమును అనేక రాజులును
భూదిగంతములనుండి రేపబడెదరు.
42వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరువారు క్రూరులు జాలిపడనివారు
వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నదివారు గుఱ్ఱములను ఎక్కువారు
బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా
వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు.
43బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలు
డాయెను అతనికి బాధ కలిగెను
ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను.
44చిరకాల నివాసమును పట్టుకొనవలెనని
శత్రువులు యొర్దాను ప్రవాహములోనుండి సింహము
వలె వచ్చుచున్నారు
నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి
వేయుదును
నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదను
నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?
నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?
45బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి
కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి
నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగు
దురు
నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయ
మొందును.
46బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని
భూమి కంపించుచున్నది
జనములలో అంగలార్పు వినబడుచున్నది.
Currently Selected:
యిర్మీయా 50: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.