సామెతలు 30
30
1దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు
పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును,
ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట.
2నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు
నరులకున్న వివేచన నాకు లేదు.
3నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను
పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు.
4ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు?
తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు?
బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు?
భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు?
ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు
తెలిసియున్నదా?
5దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే
ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
6ఆయన మాటలతో ఏమియు చేర్చకుము
ఆయన నిన్ను గద్దించునేమో
అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.
7దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను
చున్నాను
నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము;
8వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా
నుంచుము
పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ
చేయకుము
తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.
9ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను
విసర్జించి
–యెహోవా యెవడని అందునేమో
లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.
10దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు
చెప్పకుము
వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ
వగుదువు.
11తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.
12తమ దృష్టికి తాము శుద్ధులై
తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.
13కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు.వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి!
14దేశములో ఉండకుండ వారు దరిద్రులను మ్రింగు
నట్లును
మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు
నట్లును
ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లునుగల వారి
తరము కలదు.
15జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు
తృప్తిపడనివి మూడు కలవు–చాలును అని పలుకనివి
నాలుగు కలవు.
16అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును
అనని భూమి, చాలును అనని అగ్ని.
17తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని
కన్ను
లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని
తినును.
18నా బుద్ధికి మించినవి మూడు కలవు
నేను గ్రహింపలేనివి నాలుగు కలవు.
అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,
19బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ
నడచుజాడ,
కన్యకతో పురుషుని జాడ.
20జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు
తుడుచుకొని
–నేను ఏ దోషము ఎరుగననును.
21భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ
లేనివి నాలుగు కలవు.
22అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు
నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,
23కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను
రాలికి హక్కు దారురాలైన దాసి.
24భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి
మిక్కిలి జ్ఞానముగలవి.
25చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో
తమ ఆహారమును సిద్ధపరచుకొనును.
26చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి
పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.
27మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు
తీరి సాగిపోవును.
28బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల
గృహములలో అది యుండును.
29డంబముగా నడుచునవి మూడు కలవు
30ఠీవితో నడుచునవి నాలుగు కలవు–అవేవనగా
ఎల్లమృగములలో పరాక్రమముగలదై
ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము
31శోణంగి కుక్క, మేకపోతు,
తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు.
32నీవు బుద్ధిహీనుడవై అతిశయపడియుండినయెడల
కీడు యోచించి యుండినయెడల
నీ చేతితో నోరు మూసికొనుము.
33పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా
రక్తము వచ్చును, కోపము రేపగా కలహము
పుట్టును.
Currently Selected:
సామెతలు 30: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.