YouVersion Logo
Search Icon

కీర్తనలు 138

138
దావీదు కీర్తన.
1నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను
దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.
2నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారముచేయు
చున్నాను
నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు
గొప్పచేసియున్నావు.
నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతా
స్తుతులు నేను చెల్లించెదను.
3నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి.
నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.
4యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన
మాటలువిని
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.
5–యెహోవా మహా ప్రభావముగలవాడనివారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసె
దరు.
6యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను
లక్ష్యపెట్టును
ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.
7నేను ఆపదలలో చిక్కుబడి యున్నను నీవు నన్ను
బ్రదికించెదవు
నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై
నీవు నీచేయి చాపెదవు
నీ కుడిచేయి నన్ను రక్షించును.
8యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును.
యెహోవా, నీ కృప నిరంతరముండును
నీ చేతికార్యములను విడిచిపెట్టకుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in