కీర్తనలు 32
32
దావీదు కీర్తన. దైవధ్యానము.
1తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు
తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు
ధన్యుడు.
2యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు
ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.
3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన
నా ఆర్తధ్వనివలన
నాయెముకలు క్షీణించినవి.
4దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను
నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.)
5నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని
–యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు
కొందుననుకొంటిని.
నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.)
6కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను
ప్రార్థనచేయుదురు.
విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను
నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
7నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను
రక్షించెదవు
విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
8నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ
మును నీకు బోధించెదను
నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
9బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద
వలెనైనను మీరు ఉండకుడి
అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను
కళ్లెముతోను బిగింపవలెను.
10భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి
యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవ
రించుచున్నది.
11నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి
ఉల్లసించుడి
యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము
చేయుడి.
Currently Selected:
కీర్తనలు 32: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.