YouVersion Logo
Search Icon

కీర్తనలు 46

46
ప్రధానగాయకునికి. కోరహు కుమారులది. అలామోతు అను రాగముమీద పాడదగినది. గీతము.
1దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
2కావున భూమి మార్పునొందినను నడిసముద్రము
లలో పర్వతములు మునిగినను
3వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను
ఆ పొంగునకు పర్వతములు కదలినను
మనము భయపడము. (సెలా.)
4ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును
సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష
పరచుచున్నవి.
5దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము
లేదు
అరుణోదయమున దేవుడు దానికి సహాయముచేయు
చున్నాడు.
6జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి
ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి
పోవుచున్నది.
7సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై
యున్నాడు.
యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై
యున్నాడు.
8యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి.
ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.
9ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు
వాడు.
విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును
ఆయనే
యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు
ఆయనే.
10–ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి
అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును
భూమిమీద నేను మహోన్నతుడనగుదును
11సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై
యున్నాడు
యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై
యున్నాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in