YouVersion Logo
Search Icon

కీర్తనలు 56

56
ప్రధానగాయకునికి. యోనతేలెమ్ రెహోకీమ్ అను రాగముమీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. అనుపదగీతము.
1దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను
మ్రింగవలెనని యున్నారు
దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు.
2అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు
దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మ్రింగ
వలెనని యున్నారు
3నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్ర
యించుచున్నాను.
4దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను
దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయ
పడను
శరీరధారులు నన్నేమి చేయగలరు?
5దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు
నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము
పుట్టుచున్నవి.
6వారు గుంపుకూడి పొంచియుందురు
నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు
జాడలు కనిపెట్టుదురు.
7తాముచేయు దోషక్రియలచేత వారు తప్పించు
కొందురా?
దేవా, కోపముచేత జనములను అణగగొట్టుము
8నా సంచారములను నీవు లెక్కించియున్నావు
నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి
అవి నీ కవిలెలో#56:8 పుస్తకము. కనబడును గదా.
9నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు
తిరుగుదురు.
దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును.
10దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను
యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను
11నేను దేవునియందు నమ్మికయుంచియున్నాను
నేను భయపడను
నరులు నన్నేమి చేయగలరు?
12దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును
తప్పించియున్నావు
నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు
నట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించి
యున్నావు.
13నేను నీకు మ్రొక్కుకొని యున్నాను
నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in