YouVersion Logo
Search Icon

కీర్తనలు 83

83
ఆసాపు కీర్తన. గీతము.
1దేవా, ఊరకుండకుము
దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
2నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు
నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు.
3నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్నుచున్నారు
నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచనచేయుచున్నారు
4వారు–ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక
పోవునట్లు
జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని
చెప్పుకొనుచున్నారు.
5ఏకమనస్సుతో వారు ఆలోచనచేసికొనియున్నారు
నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.
6-7గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును
మోయాబీయులును హగ్రీయులును
గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును
ఫిలిష్తీయులును తూరు నివాసులును
నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
8అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు
లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. (సెలా.)
9మిద్యానునకు నీవు చేసినట్లు
కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును
చేసినట్లు వారికిని చేయుము.
10వారు ఏన్దోరులో నశించిరి
భూమికి పెంట అయిరి.
11ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి
ప్రధానులకును చేయుము
జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లువారి సకల రాజులకును చేయుము.
12–దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు
కొందమని వారు చెప్పుకొనుచున్నారు.
13నా దేవా, సుడి తిరుగు ధూళివలెను
గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము
14అగ్ని అడవిని కాల్చునట్లు
కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు
15నీ తుపానుచేత వారిని తరుముము
నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.
16యెహోవా, వారు నీ నామమును వెదకునట్లువారికి పూర్ణావమానము కలుగజేయుము.
17వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాకవారు భ్రమసి నశించుదురు గాక.
18యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే
సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు
గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in