పరమగీతము 7
7
1రాజకుమార పుత్రికా,
నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు
చున్నావు!
నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె
ఆడుచున్నవి.
2నీ నాభీదేశము మండలాకార కలశము
సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును
గాక
నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి
3నీ యిరు కుచములు
జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి
యున్నవి.
4నీ కంధరము దంతగోపుర రూపము
నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న
రెండు తటాకములతో సమానములు
నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను
శిఖరముతో సమానము.
5నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము
నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి.
రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.
6నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో
నీవు అతిసుందరమైనదానవు
అతి మనోహరమైనదానవు.
7నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు
నీ కుచములు గెలలవలె నున్నవి.
8తాళవృక్షము నెక్కుదుననుకొంటిని
దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని
నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి.
నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.
9నీ నోరు శ్రేష్ఠద్రాక్షారసమువలె నున్నది
ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర
పానీయము
అది నిద్రితుల యధరములు ఆడజేయును.
10నేను నా ప్రియునిదానను
అతడు నాయందు ఆశాబద్ధుడు.
11నా ప్రియుడా, లెమ్ము రమ్ము
మనము పల్లెలకు పోదము
గ్రామసీమలో నివసింతము.
12పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము
ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో
వాటి పువ్వులు వికసించెనో లేదో
దాడిమచెట్లు పూతపట్టెనో లేదో
చూతము రమ్ము
అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను
13పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది
నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన
నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు
మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.
Currently Selected:
పరమగీతము 7: TELUBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.