YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 33

33
మోషే ప్రజలను ఆశీర్వదించటం
1దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన ఆశీర్వాదం ఇది. 2మోషే చేప్పినది:
“యెహోవా సీనాయినుండి వచ్చెను.
యెహోవా శేయీరులో ప్రభాత వెలుగులా ఉన్నాడు.
ఆయన పారాను కొండ నుండి ప్రకాశించే వెలుగులా ఉన్నాడు.
యెహోవా 10,000 మంది పరిశుద్ధులతో వచ్చాడు.
ఆయన కుడిచేతి వైపున దేవుని గొప్ప గొప్ప మహా సైనికులు ఉన్నారు.
3అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు.
ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు.
వారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు.
ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీకరిస్తారు.
4మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు.
అది యాకోబు ప్రజలందరికీ చెందుతుంది.
5ప్రజలు, వారి నాయకులు
సమావేశమైనప్పుడు యెషూరూనుకు#33:5 యెషూరూనుకు ఇది ఇశ్రాయేలుకు మరో పేరు మంచివాడు లేక సత్యవంతుడు అని దీని అర్థం. రాజు ఉన్నాడు.
యెహోవాయే వారి రాజు.
రూబేనుకు ఆశీర్వాదాలు
6“రూబేను మరణించక, జీవించునుగాక!
ఆతని వంశంలో అనేకమంది ప్రజలు ఉందురు గాక!”
యూదాకు ఆశీర్వాదాలు
7యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు చెప్పాడు:
“యెహోవా, యూదా నాయకుడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు.
అతణ్ణి తన ప్రజల దగ్గరకు చేర్చు.
అతణ్ణి బలంవతుణ్ణి చేయి. అతడు తన శత్రువులను ఓడించటానికి సహాయం చేయి!”
లేవీకి ఆశీర్వాదాలు
8లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు.
“నీ నిజమైన అనుచరుడు లేవీ ఊరీము, తుమ్మీమునకు#33:8 ఊరీము, తుమ్మీమునకు దేవుని నుండి తమ ప్రశ్నలకు జవాబులు పొందేందుకు యాజకులు వీటిని ఉపయోగిం చేవారు. కాపలా ఉండేవాడు.
నీ పత్యేక మనిషి వాటిని కాపాడుతాడు.
మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను పరీక్షించావు.
వాళ్లు నీ వాళ్లని (నిన్ను ప్రేమించుటకు) మెరీబా#33:8 మస్సా … మెరీబా సంఖ్యా. 20:1-13 చూడండి. నీళ్ల దగ్గర నీవు రుజువు చేసావు.
9లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు.
‘వారి విషయం నేను లెక్క చేయను’
అతడు తన సొంత సోదరులను స్వీకరించలేదు.
తన సొంత పిల్లల్ని తెలుసుకోలేదు.
లేవీయులు నీ మాటకు విధేయులయ్యారు
నీ ఒడంబడికను నిలబెట్టారు.
10యాకోబుకు#33:10 యాకోబు ఇశ్రాయేలు యొక్క మరో పేరు. నీ నియమాలను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు.
వాళ్లు నీ యెదుట ధూపం వేస్తారు.
నీ బలిపీఠం మీద పరిపూర్ణ దహన బలులు అర్పిస్తారు.
11“యెహోవా, లేవీకి చెందిన వాటిని ఆశీర్వదించు
అతడు జరిగించే వాటిని స్వీకరించు.
అతని మీద దాడి చేసే వాళ్లను నాశనం చేయి.”
బెన్యామీనుకు ఆశీర్వాదాలు
12బెన్యామీను గూర్చి మోషే ఇలా చెప్పాడు.
“యెహోవా బెన్యామీనును ప్రేమిస్తున్నాడు.
బెన్యామీను ఆయన చెంత క్షేమంగా జీవిస్తాడు.
అతనిని యెహోవా ఎల్లప్పుడూ కాపాడతాడు.
మరియు యెహోవా అతని దేశంలో నివసిస్తాడు.”#33:12 మరియు … నివసిస్తాడు అక్షరాల అతడు ఆయన భుజాల మధ్య జీవిస్తాడని అర్థం. యెహోవా ఆలయం బెన్యామీను, యూదా వారి సరిహద్దుల మధ్య ఉంటుందని కావచ్చు.
యోసేపుకు ఆశీర్వాదాలు
13యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు:
“యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించును గాక.
ఆకాశం నుండి శ్రేష్ఠమైన వాటితో
భూమి క్రింద దాగి ఉన్న లోతైన ధన సంపదతో
14సూర్యుని శ్రేష్ఠఫలాలతో
నెల నెలా శ్రేష్ఠపంటలతో
15ప్రాచీన పర్వతాల నుండి శ్రేష్ఠఫలాలతో
కొండల్లో శాశ్వతంగా ఉంచబడే శ్రేష్ఠ పదార్థాలతో
16భూమి నుండి శ్రేష్ఠమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో,
మండుతూ ఉండే పొదలో నివాసం చేసే యెహోవా కటాక్షంతో,
తన సోదరులనుంచి వేరుగావించబడ్డ యోసేపు తలమీద యోసేపు నడినెత్తి మీద ఆశీర్వాదం వచ్చునుగాక.
17యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ,
ఈ ఎద్దు కొమ్ములు అడవి దున్నపోతు కొమ్ములంత పెద్దవిగా ఉంటాయి.
యోసేపు మందలు మనుష్యుల్ని తోసివేస్తాయి. అందర్నీ,
భూదిగాంతాల వరకు తోసివేస్తాయి.
అవును, మనష్షేకు వేలాదిమంది ప్రజలు ఉన్నారు,
అవును, ఎఫ్రాయిముకు పది వేలమంది ప్రజలు ఉన్నారు.”
జెబూలూనుకు, ఇశ్శాఖారుకు ఆశీర్వాదాలు
18జెబూలూను గూర్చి మోషే చెప్పినది:
“జెబూలూనూ, నీవు బయటకు వెళ్లినప్పుడు,
ఇశ్శాఖారూ, నీ యింటివద్ద నీ గుడారాలలో సంతోషంగా ఉండు.
19వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలుస్తారు.
అక్కడ వారు సరైన బలులు అర్పిస్తారు.
ఎందుకంటే, సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకొంటారు.
ఇసుకలో దాగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనుక.”
గాదుకు ఆశీర్వాదాలు
20గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు:
“గాదును విశాలపర్చే దేవునికి స్తోత్రాలు!
గాదు సింహంలా పడుకుంటాడు,
చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు.
21శ్రేష్ఠభాగం అతడు తనకోసం ఎంచుకుంటాడు
అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది.
ప్రజానాయకులు అతని దగ్గరకు వస్తారు ఇశ్రాయేలీయుల యెడల అతడు దయ చూపుతాడు.
యెహోవా దృష్టికి మంచివాటిని అతడు చేస్తాడు
యెహోవా అతని పక్షంగా తీర్పుతీరుస్తాడు.”
దానుకు ఆశీర్వాదాలు
22దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు:
“దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.”
నఫ్తాలీకి ఆశీర్వాదాలు
23నఫ్తాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు.
“నఫ్తాలీ, నీవు దయపొంది తృప్తిగా ఉన్నావు,
యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు,
(గలలీ) పశ్చిమ, దక్షిణాల భూమిని నీవు తీసుకో.”
ఆషేరుకు ఆశీర్వాదాలు
24ఆషేరును#33:24 ఆషేరు దీని అర్థం ధన్యుడు లేక సంతోషం. గూర్చి మోషే ఇలా చెప్పాడు:
“కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు;
అతణ్ణి తన సోదరులకు ప్రియమైన వాడ్నిగా ఉండనియ్యండి.
అతణ్ణి తన పాదాలు తైలముతో కడుగుకోనివ్వండి.
25నీ తాళాలు యినుపవి, యిత్తడిని,
నీ బలం జీవితం అంతా ఉంటుంది.”
మోషే దేవుణ్ణి స్తుతించుట
26“ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు.
దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు.
మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు.
27నిత్యుడైన దేవుడు
నీకు భద్రతా స్థలం.
శాశ్వతంగా ఆదుకునే హస్తాలు
నీక్రింద ఉన్నాయి.
దేవుడు శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు.
‘శత్రువును నాశనం చేయి’ అంటాడు.
28కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు,
ధాన్యం, ద్రాక్షారసం ఉండే దేశంలో
యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది.
అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది.
29ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు.
యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీవలె ఏ దేశమూ లేదు.
యెహోవాయే నీకు సహాయం చేసేవాడు.
నీ విజయానికి యెహోవాయే ఖడ్గం.
నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు.
వారి అబద్ధపు దేవతల పూజా స్థలాల
మీద మీరు నడుస్తారు.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in