YouVersion Logo
Search Icon

1 దినవృత్తాంతములు 24

24
యాజకుల విభాగాలు
1ఇవి అహరోను వారసుల విభాగాలు:
అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 2నాదాబు, అబీహు కుమారులు లేకుండానే తమ తండ్రి కంటే ముందే చనిపోయారు; కాబట్టి ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు. 3ఎలియాజరు వారసుడైన సాదోకు, ఈతామారు వారసుడైన అహీమెలెకు సహాయంతో, వారికి నియమించబడిన సేవా క్రమంలో, దావీదు వారిని విభాగించాడు. 4ఈతామారు వారసులలో కంటే ఎలియాజరు వారసులలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం ఎలియాజరు వారసులలో పదహారుగురు కుటుంబ పెద్దలు, ఈతామారు వారసులలో ఎనిమిది మంది కుటుంబ పెద్దలుగా నియమించబడ్డారు. 5ఎలియాజరు వారసులలో, ఈతామారు వారసులలో పరిశుద్ధాలయ అధికారులుగా, దేవుని సేవకులుగా ఉన్నారు కాబట్టి, పక్షపాతం లేకుండా చీట్లు వేసి వారిని విభాగించారు.
6లేవీయులలో లేఖికునిగా ఉన్న నెతనేలు కుమారుడైన షెమయా, వారి పేర్లను రాజు, అతని అధికారులు యాజకుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు, యాజకుల కుటుంబ పెద్దలు, లేవీయుల ఎదుట నమోదు చేశాడు. ఒక కుటుంబం ఎలియాజరు నుండి, తర్వాత మరొక కుటుంబం ఈతామారు నుండి తీసుకోబడింది.
7మొదటి చీటి యెహోయారీబుకు,
రెండవది యెదాయాకు,
8మూడవది హారీముకు,
నాలుగవది శెయొరీముకు,
9అయిదవది మల్కీయాకు,
ఆరవది మీయామినుకు,
10ఏడవది హక్కోజుకు,
ఎనిమిదవది అబీయాకు,
11తొమ్మిదవది యెషూవకు,
పదవది షెకన్యాకు,
12పదకొండవది ఎల్యాషీబుకు,
పన్నెండవది యాకీముకు,
13పదమూడవది హుప్పాకు,
పద్నాలుగవది యెషెబాబుకు,
14పదిహేనవది బిల్గాకు,
పదహారవది ఇమ్మేరుకు,
15పదిహేడవది హెజీరుకు,
పద్దెనిమిదవది హప్పిస్సేసుకు,
16పందొమ్మిదవది పెతహయాకు,
ఇరవయ్యవది యెహెజ్కేలుకు,
17ఇరవై ఒకటవది యాకీనుకు,
ఇరవై రెండవది గామూలుకు,
18ఇరవై మూడవది దెలాయ్యాకు,
ఇరవై నాలుగవది మయజ్యాకు వచ్చాయి.
19ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను వారికి నియమించిన నిబంధనల ప్రకారం, వారు యెహోవా మందిరంలో ప్రవేశించినప్పుడు వారు చేయాల్సిన సేవా క్రమం ఇది.
లేవీయులలో మిగిలినవారు
20లేవీ వారసులలో మిగిలినవారు:
అమ్రాము కుమారుల నుండి: షూబాయేలు;
షూబాయేలు కుమారుల నుండి: యెహెద్యాహు.
21రెహబ్యాకు కుమారుల నుండి పెద్దవాడైన ఇష్షీయా.
22ఇస్హారీయుల్లో నుండి: షెలోమోతు;
షెలోమోతు కుమారుల నుండి: యహతు.
23హెబ్రోను కుమారులు:
యెరీయా#24:23 చాలా హెబ్రీ ప్రతులలో, కొ. ప్రా. ప్ర.లలో యెరీయా కుమారులు మొదటివాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
24ఉజ్జీయేలు కుమారుడు: మీకా;
మీకా కుమారుల నుండి: షామీరు.
25మీకా సోదరుడు: ఇష్షీయా;
ఇష్షీయా కుమారుల నుండి: జెకర్యా.
26మెరారి కుమారులు: మహలి, మూషి.
యహజీయాహు కుమారుడు: బెనో.
27మెరారి కుమారులు:
యహజీయాహు నుండి: బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
28మహలికి నుండి: ఎలియాజరు, ఇతనికి కుమారులు లేరు.
29కీషు నుండి: కీషు కుమారుడు: యెరహ్మెయేలు.
30మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు.
వీరు తమ కుటుంబాల ప్రకారం లేవీయులు.
31వీరు తమ బంధువులైన అహరోను వారసులు చేసినట్టు, రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకులు లేవీయుల కుటుంబ పెద్దలు ఎదుట చీట్లు వేసుకున్నారు. పెద్ద సోదరుని కుటుంబాలు చిన్న సోదరుని కుటుంబాలు కలిసి చీట్లు వేసుకున్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in