YouVersion Logo
Search Icon

మీకా 5

5
బేత్లెహేము నుండి వాగ్దాన పాలకుడు
1సైన్య సమూహాలు గల నగరమా, సమూహాలను సమకూర్చు,
శత్రువులు మనల్ని ముట్టడించారు.
వారు ఇశ్రాయేలు ప్రజల పాలకున్ని
బెత్తంతో చెంపమీద కొడతారు.
2“అయితే బేత్లెహేము ఎఫ్రాతా,
యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి,
నా కోసం
ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు,
ఆయన పూర్వకాలం నుండి
శాశ్వతకాలం ఉన్నవాడు.”
3కాబట్టి ప్రసవ వేదన పడే స్త్రీ బిడ్డను కనేవరకు
ఇశ్రాయేలు విడిచిపెట్టబడుతుంది.
అతని సోదరులలో మిగిలిన వారు,
ఇశ్రాయేలీయులతో చేరడానికి తిరిగి వస్తారు.
4ఆయన యెహోవా బలం పొంది
తన దేవుడైన యెహోవా నామ మహిమతో
లేచి తన మందను మేపుతాడు.
ఆయన మహాత్యం భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది,
కాబట్టి వారు సురక్షితంగా నివసిస్తారు.
5అష్షూరు వారు దండెత్తి మన దేశంలోకి వచ్చి
మన కోటలలో ప్రవేశించేటప్పుడు,
ఆయన మన సమాధానం అవుతారు
మనం వారికి విరుద్ధంగా ఏడుగురు కాపరులను,
ఎనిమిది మంది నాయకులుగా నియమిస్తాము.
6వీరు ఖడ్గంతో అష్షూరు దేశాన్ని,
దూసిన ఖడ్గంతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు.
అష్షూరు వారు దండెత్తి మన సరిహద్దులను దాటి,
మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు
ఆయన మనల్ని రక్షిస్తారు.
7యాకోబు సంతానంలో మిగిలినవారు,
అనేక జనాల మధ్యలో,
యెహోవా కురిపించే మంచులా,
ఎవరి కోసం ఎదురుచూడకుండ
ఏ మనిషి మీద ఆధారపడకుండా
గడ్డి మీద కురిసే వానజల్లులా ఉంటారు.
8యాకోబు సంతానంలో మిగిలినవారు దేశాల మధ్య,
అనేక జనాల మధ్య,
అడవి మృగాలలో సింహంలా,
గొర్రెల మందలలో దూరి,
ఎవ్వరూ విడిపించలేనంతగా
వాటిని త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉంటారు.
9మీ హస్తం మీ విరోధుల మీద విజయం సాధిస్తుంది,
మీ శత్రువులందరూ నాశనమవుతారు.
10యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ దినాన”
“నేను మీ మధ్య నుండి మీ గుర్రాలను నాశనం చేస్తాను,
మీ రథాలను ధ్వంసం చేస్తాను.
11మీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను
మీ కోటలను పడగొడతాను,
12మీ మధ్య మంత్రవిద్య లేకుండా నాశనం చేస్తాను
ఇక ఎన్నడూ మీరు సోదె చెప్పరు.
13నేను మీ విగ్రహాలను,
మీ పవిత్ర రాళ్లను మీ మధ్య నుండి నిర్మూలిస్తాను;
ఇకపై మీరు ఎన్నడు
మీ చేతి పనులకు మ్రొక్కరు.
14నేను మీ పట్టణాలను పడగొట్టినప్పుడు,
మీ మధ్య నుండి అషేరా స్తంభాలను పెళ్లగిస్తాను.
15నా మాట వినని దేశాల మీద
కోపంతో, క్రోధంతో ప్రతీకారం తీసుకుంటాను.”

Currently Selected:

మీకా 5: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in