మీకా 6
6
ఇశ్రాయేలుపై యెహోవా అభియోగం
1యెహోవా చెప్పేది వినండి:
“మీరు నిలబడి, పర్వతాల ఎదుట నా వాదన వినిపించండి;
కొండలు మీరు చెప్పేది వినాలి.
2“పర్వతాల్లారా, యెహోవా చేసిన నేరారోపణ వినండి;
భూమికి నిత్యమైన పునాదుల్లారా, ఆలకించండి.
యెహోవా తన ప్రజలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు;
ఆయన ఇశ్రాయేలుపై అభియోగం మోపుతున్నారు.
3“నా ప్రజలారా! నేను మీకేం చేశాను?
నేను మిమ్మల్ని ఎలా కష్టపెట్టాను? నాకు జవాబివ్వండి.
4నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చాను
మిమ్మల్ని దాస్యంలో ఉంచిన ఆ దేశం నుండి విడిపించాను.
మీకు దారి చూపడానికి
మోషే అహరోను మిర్యాములను పంపించాను.
5నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఎలా కుట్ర చేశాడో,
బెయోరు కుమారుడైన బిలాము అతనికి ఎలా జవాబిచ్చాడో
జ్ఞాపకం చేసుకోండి.
యెహోవా నీతి క్రియలు మీరు గ్రహించేలా
షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన మీ ప్రయాణం జ్ఞాపకం చేసుకోండి.”
6ఏమి తీసుకుని నేను యెహోవా సన్నిధిలోకి రావాలి,
మహోన్నతుడైన దేవుని ఎదుట నమస్కరించాలి?
నేను దహనబలులను, ఏడాది దూడలను
ఆయన సన్నిధికి తీసుకురావాలా?
7వేల కొలది పొట్టేళ్ళూ,
పదివేల నదులంత నూనెను అర్పిస్తే యెహోవా సంతోషిస్తారా?
నా అతిక్రమం కోసం నా జ్యేష్ఠ కుమారున్ని,
నా పాపం కోసం నా గర్భఫలాన్ని అర్పించాలా?
8ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు.
యెహోవా నీ నుండి కోరేదేంటి?
న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం,
వినయం#6:8 లేదా జ్ఞానం కలిగి నీ దేవునితో కలిసి నడవడమే కదా.
ఇశ్రాయేలు అపరాధం శిక్ష
9వినండి! యెహోవా పట్టణానికి ఇలా ప్రకటన చేస్తున్నారు:
మీ నామానికి భయపడడమే జ్ఞానం,
“శిక్షను, దానిని విధించేవాని మాటలు వినండి.
10దుర్మార్గపు ఇల్లా, మీ అక్రమ సంపాదనలు,
అసహ్యకరమైన మీ తప్పుడు కొలతలు ఇంకా ఉన్నాయి కదా?
11తప్పుడు త్రాసు, మోసపు తూనిక రాళ్లున్న సంచి కలిగిన
వారిని నిర్దోషి అని నేను తీర్పు ఇవ్వాలా?
12మీ ధనవంతులు దౌర్జన్యం చేస్తున్నారు;
మీ నివాసులు అబద్ధికులు
వారి నాలుకలు కపటంగా మాట్లాడతాయి.
13కాబట్టి మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని
నాశనం చేసి నిర్మూలిస్తాను.
14మీరు తింటారు కాని తృప్తి చెందరు;
మీ కడుపులు ఇంకా ఖాళీగా ఉంటాయి.
మీరు కూడబెట్టుకుంటారు కాని ఏమి కాపాడుకోలేరు,
ఎందుకంటే మీరు భద్రపరచుకుంది నేను ఖడ్గానికి అప్పగిస్తాను.
15మీరు నాటుతారు కాని పంట కోయరు;
మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు;
ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు.
16మీరు ఒమ్రీ కట్టడాలను పాటించారు
అహాబు ఇంటివారి విధానాలన్నీ పాటించారు;
వారి సంప్రదాయాలను అనుసరించారు;
కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేస్తాను
ప్రజలు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు;
మీరు నా ప్రజల నిందను భరిస్తారు.”
Currently Selected:
మీకా 6: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: