YouVersion Logo
Search Icon

నహూము 2

2
నీనెవె పతనం
1నీనెవే! దాడి చేసేవాడు నీ మీదికి వస్తున్నాడు.
కోటకు కాపలా ఉండు,
రహదారి మీద నిఘా వేయి,
నడుము బిగించుకో,
నీ బలమంతటిని కూడగట్టుకో!
2దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ,
వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ,
యెహోవా ఇశ్రాయేలు వైభవంలా,
యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.
3సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి;
యోధులు ఎరుపు దుస్తులు ధరించారు.
వారు సిద్ధపడిన రోజున
రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది;
సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.#2:3 కొ.ప్ర.లలో, సిద్ధంగా ఉన్నాయి; గుర్రపురౌతులు ముందుకు వెనుకకు పరుగెడుతున్నాయి.
4రథాలు వీధుల్లో దూసుకెళ్తాయి,
రాజమార్గాల గుండా ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతున్నాయి.
అవి మండుతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి;
అవి మెరుపులా వేగంగా వెళ్తున్నాయి.
5నీనెవె తన అధికారులను పిలుస్తుంది,
అయినా వారు తమ దారిలో తడబడతారు.
వారు నగర గోడకు గుద్దుకుంటారు;
రక్షణ కవచం సిద్ధం చేస్తారు.
6నది ద్వారాలు తెరుస్తారు,
రాజభవనాలు కూలిపోతాయి.
7నీనెవెను బందీగా,
తీసుకుపోవాలని శాసించబడింది.
ఆమె దాసీలు పావురాల్లా మూలుగుతూ,
తమ రొమ్ముల మీద కొట్టుకుంటారు.
8నీనెవె నీరు పారుతున్న
నీరు కొలనులా ఉంది.
“ఆగు! ఆగు!” అని వారు ఏడుస్తారు,
కానీ ఎవరూ వెనుకకు తిరుగరు.
9వెండిని దోచుకో!
బంగారాన్ని దోచుకో!
ఆమె ఖజానాల్లో
అంతులేని సంపదలు ఉన్నాయి!
10ఆమె కొల్లగొట్టబడి దోచుకోబడి పాడుచేయబడుతుంది!
హృదయాలు కరిగిపోతున్నాయి, మోకాళ్లు వణుకుతున్నాయి,
శరీరాలు వణుకుతున్నాయి, ప్రతీ ముఖం పాలిపోతుంది.
11సింహాల గుహ ఇప్పుడు ఎక్కడ?
వాటి పిల్లల మేత స్థలం ఎక్కడ?
సింహం, ఆడసింహం, సింహం కూనలు
ఏ భయం లేకుండా తిరిగే చోటు ఏది?
12సింహం తన కూనల కోసం కావలసినంత వేటాడుతూ,
ఆడ సింహానికి ఆహారంగా జంతువుల మెడ కొరికి చంపుతూ,
చంపిన వాటితో తన నివాస స్థలాలను,
వేట మాంసంతో తన గుహలను నింపింది.
13సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు
“నేను నీకు వ్యతిరేకిని,
నీ రథాల నుండి పొగ వచ్చేలా కాల్చివేస్తాను,
ఖడ్గం నీ కొదమ సింహాలను చంపివేస్తుంది.
నేను భూమ్మీద నీకు ఏ ఎర దొరక్కుండా చేస్తాను.
నీ దూతల స్వరాలు
ఇక వినబడవు.”

Currently Selected:

నహూము 2: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in