YouVersion Logo
Search Icon

కీర్తనలు 116

116
కీర్తన 116
1నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు;
కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు.
2ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి,
నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.
3మరణపాశాలు నన్ను చుట్టివేశాయి,
సమాధి వేదన నా మీదికి వచ్చింది.
బాధ దుఃఖం నన్ను అధిగమించాయి.
4అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను:
“యెహోవా, నన్ను రక్షించండి!”
5యెహోవా దయగలవాడు నీతిమంతుడు;
మన దేవుడు కనికరం కలవాడు.
6యెహోవా సామాన్యులను కాపాడతారు;
నేను దుర్దశలో ఉన్నప్పుడు, ఆయన నన్ను రక్షించారు.
7నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు,
ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్పగా వ్యవహరించారు.
8యెహోవా, మీరు, మరణం నుండి నన్ను,
కన్నీటి నుండి నా కళ్ళను,
జారిపడకుండా నా పాదాలను విడిపించారు.
9నేను సజీవుల భూమిలో
యెహోవా ఎదుట నడుస్తాను.
10“నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు,
నేను యెహోవాపై నమ్మకం ఉంచాను;
11నా కంగారులో నేను,
“మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను.
12యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి
నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను?
13నేను రక్షణ పాత్రను పైకెత్తి
యెహోవా పేరట మొరపెడతాను.
14ఆయన ప్రజలందరి సమక్షంలో,
నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు తీర్చుకుంటాను.
15యెహోవా దృష్టిలో విలువైనది
ఆయన నమ్మకమైన సేవకుల మరణము.
16యెహోవా, నేను మీ సేవకుడిని మీ పనిమనిషి కుమారున్ని,
నా తల్లి చేసినట్లే నేను మీకు సేవ చేస్తాను;
మీరు నా సంకెళ్ళ నుండి నన్ను విడిపించారు.
17నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను
యెహోవా నేను మీ పేరట మొరపెడతాను.
18-19ఆయన ప్రజలందరి సమక్షంలోను,
యెహోవా మందిర ఆవరణాల్లోను,
యెరూషలేమా, మీ మధ్యను,
నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను.
యెహోవాను స్తుతించండి.#116:19 హెబ్రీలో హల్లెలూయా

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in