యోహాను 9:2-3

యోహాను 9:2-3 TCV

ఆయన శిష్యులు ఆయనను, “రబ్బీ, అతడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు అతడా లేక అతని తల్లిదండ్రులా?” అని అడిగారు. యేసు, “అతడు కానీ అతని తల్లిదండ్రులు కాని పాపం చేయలేదు, కానీ దేవుని కార్యాలు అతనిలో వెల్లడి కావడానికి ఇలా జరిగింది.