1
1 కొరింథీయులకు 15:58
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
సరిపోల్చండి
Explore 1 కొరింథీయులకు 15:58
2
1 కొరింథీయులకు 15:57
అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
Explore 1 కొరింథీయులకు 15:57
3
1 కొరింథీయులకు 15:33
మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరు పును.
Explore 1 కొరింథీయులకు 15:33
4
1 కొరింథీయులకు 15:10
అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.
Explore 1 కొరింథీయులకు 15:10
5
1 కొరింథీయులకు 15:55-56
ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
Explore 1 కొరింథీయులకు 15:55-56
6
1 కొరింథీయులకు 15:51-52-51-52
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
Explore 1 కొరింథీయులకు 15:51-52-51-52
7
1 కొరింథీయులకు 15:21-22
మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
Explore 1 కొరింథీయులకు 15:21-22
8
1 కొరింథీయులకు 15:53
క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.
Explore 1 కొరింథీయులకు 15:53
9
1 కొరింథీయులకు 15:25-26
ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.
Explore 1 కొరింథీయులకు 15:25-26
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు