1
ప్రసంగి 11:9
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము
సరిపోల్చండి
Explore ప్రసంగి 11:9
2
ప్రసంగి 11:10
లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.
Explore ప్రసంగి 11:10
3
ప్రసంగి 11:4
గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.
Explore ప్రసంగి 11:4
4
ప్రసంగి 11:5
చూలాలి గర్భమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
Explore ప్రసంగి 11:5
5
ప్రసంగి 11:6
ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు.
Explore ప్రసంగి 11:6
6
ప్రసంగి 11:2
ఏడుగురికిని ఎనమండు గురికిని భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు.
Explore ప్రసంగి 11:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు