1
నిర్గమకాండము 8:18-19
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరిగాని అది వారివలన కాకపోయెను. పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండగా శకునగాండ్రు –ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.
సరిపోల్చండి
Explore నిర్గమకాండము 8:18-19
2
నిర్గమకాండము 8:1
యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము
Explore నిర్గమకాండము 8:1
3
నిర్గమకాండము 8:15
ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.
Explore నిర్గమకాండము 8:15
4
నిర్గమకాండము 8:2
నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.
Explore నిర్గమకాండము 8:2
5
నిర్గమకాండము 8:16
అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.
Explore నిర్గమకాండము 8:16
6
నిర్గమకాండము 8:24
యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోనికిని అతని సేవకుల యిండ్లలోనికిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
Explore నిర్గమకాండము 8:24
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు