ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము
యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు
వెళ్లును.
జనములు గుంపులు గుంపులుగా వచ్చి
–యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత
మునకు మనము వెళ్లుదము రండి
ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును
మనము ఆయన త్రోవలలో నడుచుదము
అని చెప్పుకొందురు.