1
మార్కు 14:36
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.
సరిపోల్చండి
మార్కు 14:36 ని అన్వేషించండి
2
మార్కు 14:38
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
మార్కు 14:38 ని అన్వేషించండి
3
మార్కు 14:9
సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
మార్కు 14:9 ని అన్వేషించండి
4
మార్కు 14:34
అప్పుడాయన–నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి
మార్కు 14:34 ని అన్వేషించండి
5
మార్కు 14:22
వారు భోజనముచేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి–మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను.
మార్కు 14:22 ని అన్వేషించండి
6
మార్కు 14:23-24
పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన –ఇది నిబంధనవిషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము.
మార్కు 14:23-24 ని అన్వేషించండి
7
మార్కు 14:27
అప్పుడు యేసు వారిని చూచి–మీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱెల కాపరిని కొట్టుదును; గొఱ్ఱెలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా.
మార్కు 14:27 ని అన్వేషించండి
8
మార్కు 14:42
లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను.
మార్కు 14:42 ని అన్వేషించండి
9
మార్కు 14:30
యేసు అతని చూచి– నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
మార్కు 14:30 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు