దావీదు కుమారుడును ఇశ్రాయేలురాజునైన
సొలొమోను సామెతలు.
జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును
వివేక సల్లాపములను గ్రహించుటకును
నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు
బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును
జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును
యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.