1
1 యోహాను పత్రిక 2:15-16
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే.
సరిపోల్చండి
Explore 1 యోహాను పత్రిక 2:15-16
2
1 యోహాను పత్రిక 2:17
ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.
Explore 1 యోహాను పత్రిక 2:17
3
1 యోహాను పత్రిక 2:6
ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.
Explore 1 యోహాను పత్రిక 2:6
4
1 యోహాను పత్రిక 2:1
నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు.
Explore 1 యోహాను పత్రిక 2:1
5
1 యోహాను పత్రిక 2:4
“నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు.
Explore 1 యోహాను పత్రిక 2:4
6
1 యోహాను పత్రిక 2:3
ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది.
Explore 1 యోహాను పత్రిక 2:3
7
1 యోహాను పత్రిక 2:9
తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు.
Explore 1 యోహాను పత్రిక 2:9
8
1 యోహాను పత్రిక 2:22
యేసే క్రీస్తు అని అంగీకరించని వాడు గాక మరి అబద్ధికుడు ఎవరు? తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించేవాడే క్రీస్తు విరోధి.
Explore 1 యోహాను పత్రిక 2:22
9
1 యోహాను పత్రిక 2:23
కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి ఒప్పుకున్న వాడికి తండ్రి ఉన్నట్టే.
Explore 1 యోహాను పత్రిక 2:23
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు