ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ:
“సౌలు వెయ్యిమందిని,
దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.
ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు.