అహరోను దాన్ని చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. తరువాత అహరోను “రేపు యెహోవాకు పండగ జరుగుతుంది” అని చాటింపు వేయించాడు. తరువాతి రోజు ప్రజలు ఉదయాన్నే లేచి హోమబలులు, శాంతిబలులు సమర్పించారు. తరువాత ప్రజలు తినడానికి, తాగడానికి కూర్చున్నారు. నాట్యం చేయడం మొదలు పెట్టారు.