1
గలతీ పత్రిక 6:9
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము.
సరిపోల్చండి
Explore గలతీ పత్రిక 6:9
2
గలతీ పత్రిక 6:10
కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
Explore గలతీ పత్రిక 6:10
3
గలతీ పత్రిక 6:2
ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
Explore గలతీ పత్రిక 6:2
4
గలతీ పత్రిక 6:7
మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
Explore గలతీ పత్రిక 6:7
5
గలతీ పత్రిక 6:8
ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.
Explore గలతీ పత్రిక 6:8
6
గలతీ పత్రిక 6:1
సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
Explore గలతీ పత్రిక 6:1
7
గలతీ పత్రిక 6:3-5
ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా?
Explore గలతీ పత్రిక 6:3-5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు