1
యెషయా 30:21
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
మీరు కుడి వైపు గానీ ఎడమ వైపు గానీ తిరిగినప్పుడు “ఇదే మార్గం. దీనిలోనే నడవండి” అని వెనుక నుండి ఒక శబ్దాన్ని మీరు వింటారు.
సరిపోల్చండి
యెషయా 30:21 ని అన్వేషించండి
2
యెషయా 30:18
అయినా మీపై దయ కనపరచాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ధన్యులు.
యెషయా 30:18 ని అన్వేషించండి
3
యెషయా 30:15
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడూ ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీరు తిరిగి వచ్చి విశ్రాంతిగా నాలో ఉంటేనే రక్షణ పొందుతారు. మౌనంలోనూ, విశ్వాసంలోనూ మాత్రమే మీకు బలం కలుగుతుంది.” కానీ దానికి మీరు ఒప్పుకోలేదు.
యెషయా 30:15 ని అన్వేషించండి
4
యెషయా 30:20
యెహోవా నీకు వైరాన్ని ఆహారంగా, వేదనను పానీయంగా ఇచ్చాడు. అయినా నీ బోధకులు నీకు ఇక మరుగై ఉండరు. నీకు ఉపదేశం చేసే వాళ్ళని నువ్వు చూస్తావు.
యెషయా 30:20 ని అన్వేషించండి
5
యెషయా 30:19
ఎందుకంటే యెరూషలేములోనే సీయోనులోనే ఒక జనం నివాసముంటారు. వాళ్లికపై ఏడవరు. నీ రోదన ధ్వనికి ఆయన కచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు జవాబు ఇస్తాడు.
యెషయా 30:19 ని అన్వేషించండి
6
యెషయా 30:1
“తిరుగుబాటు చేసే పిల్లలకు బాధ.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “వాళ్ళు ఆలోచనలు చేస్తారు. కానీ నన్ను సంప్రదించరు. ఇతర జనాలతో స్నేహం చేస్తారు. కానీ నా ఆత్మ నిర్దేశించింది కాదు. ఈ విధంగా వాళ్ళు పాపానికి పాపాన్ని జోడిస్తారు.
యెషయా 30:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు