1
యెషయా 65:24
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
వాళ్ళు పిలవక ముందే నేను వారికి జవాబిస్తాను. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నేను వింటాను.
సరిపోల్చండి
యెషయా 65:24 ని అన్వేషించండి
2
యెషయా 65:17
ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను. గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను.
యెషయా 65:17 ని అన్వేషించండి
3
యెషయా 65:23
వారు వృథాగా ప్రయాసపడరు. దిగులు తెచ్చుకుని పిల్లలను కనరు. వారు యెహోవా దీవించే ప్రజలుగా ఉంటారు. వారి సంతానం కూడా అలాగే ఉంటారు.
యెషయా 65:23 ని అన్వేషించండి
4
యెషయా 65:22
వారు కట్టుకున్న ఇళ్ళల్లో వేరేవాళ్ళు కాపురముండరు. వారు నాటిన వాటిని ఇతరులు తినరు. నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంత ఉంటుంది. నేను ఎన్నుకున్నవారు తాము చేతులతో చేసిన వాటిని చాలాకాలం ఉపయోగించుకుంటారు.
యెషయా 65:22 ని అన్వేషించండి
5
యెషయా 65:20
కొద్దిరోజులే బతికే పసికందులు ఇక ఎన్నడూ అక్కడ ఉండరు. ముసలివారు కాలం నిండకుండా చనిపోరు. నూరేళ్ళ వయసులో చనిపోయేవారిని యువకులు అంటారు. నూరేళ్ళ వయసు ముందే చనిపోయే పాపిని శాపానికి గురి అయినవాడుగా ఎంచుతారు.
యెషయా 65:20 ని అన్వేషించండి
6
యెషయా 65:25
తోడేళ్లు గొర్రెపిల్లలు కలిసి మేస్తాయి. సింహం ఎద్దులాగా గడ్డి తింటుంది. పాము మట్టి తింటుంది. నా పవిత్ర పర్వతమంతట్లో అవి హాని చేయవు. నాశనం చేయవు” అని యెహోవా చెబుతున్నాడు.
యెషయా 65:25 ని అన్వేషించండి
7
యెషయా 65:19
నేను యెరూషలేము గురించి ఆనందిస్తాను. నా ప్రజలను గురించి ఆనందిస్తాను. ఏడుపు, రోదన దానిలో ఇక వినబడవు.
యెషయా 65:19 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు