ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ నిబంధన మాటలు వినని వాడు శాపానికి గురౌతాడు. ఐగుప్తుదేశం అనే ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పూర్వికులను రప్పించిన రోజున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, ‘నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వారికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చేలా, మీరు నా వాక్యం విని నేను మీకిచ్చే ఆజ్ఞలను బట్టి ఈ నిబంధన వాక్యాలను అనుసరిస్తే మీరు నా ప్రజలుగా, నేను మీ దేవుడుగా ఉంటాను.’”