యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను.
ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను.
గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను.
తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను.
చాలామంది ఉండడం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది.